ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు

ABN, First Publish Date - 2021-11-13T00:33:18+05:30

కోవిడ్ మహమ్మారి వల్ల ఇబ్బందులు పడిన దేశ ఆర్థిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి వల్ల ఇబ్బందులు పడిన దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. రిటెయిల్ అమ్మకాలు గత ఏడాది అక్టోబరుతో  పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరులో 34 శాతం పెరిగినట్లు భారత రిటెయిలర్ల సంఘం (ఆర్ఏఐ) వెల్లడించింది. 2019 అక్టోబరుతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరులో రిటెయిల్ అమ్మకాలు 14 శాతం పెరిగినట్లు తెలిపింది. 


ఆర్ఏఐ విడుదల చేసిన రిటెయిల్ బిజినెస్ సర్వే 21వ ఎడిషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్ మహమ్మారి రావడానికి ముందు (2019 అక్టోబరు) పరిస్థితితో పోల్చుకుంటే, ఈ ఏడాది అక్టోబరులో రిటెయిల్ అమ్మకాలు 14 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అక్టోబరు సర్వే ప్రోత్సాహకర ఫలితాలను వెల్లడించిందని ఆర్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్ రాజగోపాలన్ ఓ ప్రకటనలో తెలిపారు. పండుగల సీజన్ మొత్తం ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగిన అమ్మకాలను కలిపి చూడాలని తెలిపారు. కచ్చితమైన తుది నిర్ణయానికి రావడానికి నవంబరు నెలలో జరిగే అమ్మకాల సమాచారం కోసం వేచి చూస్తామని చెప్పారు. ప్రస్తుత సంకేతాలన్నీ సానుకూల ధోరణిని కనబరుస్తున్నాయన్నారు. 


ఆభరణాల అమ్మకాలు 2019 అక్టోబరు కన్నా 2021 అక్టోబరులో 24 శాతం పెరిగినట్లు ఈ సర్వే వెల్లడించింది. వస్త్ర రంగంలో కూడా 6 శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది. 


Updated Date - 2021-11-13T00:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising