ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నివాస గృహాల ధరల ఇండెక్స్‌

ABN, First Publish Date - 2021-06-01T06:01:45+05:30

ప్రధాన నగరాల్లోని గృహాల ధరలను తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ హౌసింగ్‌ డాట్‌ కామ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) కలిసి హౌసింగ్‌ ప్రైసింగ్‌ ఇండెక్స్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రారంభించిన హౌసింగ్‌ డాట్‌ కామ్‌, ఐఎ్‌సబీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రధాన నగరాల్లోని గృహాల ధరలను తెలుసుకోవడానికి  ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ హౌసింగ్‌ డాట్‌ కామ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) కలిసి హౌసింగ్‌ ప్రైసింగ్‌ ఇండెక్స్‌ (హెచ్‌పీఐ)ని ప్రారంభించాయి. ధరల కదలికలకు చెందిన డేటాను అందించడం ద్వారా  కొనుగోలుదారులు తగిన సమయంలో గృహాన్ని కొనుగోలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. అదే విధంగా ఇల్లు విక్రయించాలనుకునే వారికి ఏ ధరకు, ఏ సమయంలో విక్రయించాలో నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ధోరణులు తెలుసుకుని తగ్గిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి విధానకర్తలకు, ఫైనాన్షియల్‌ విశ్లేషకులకు దోహదం చేస్తుం ది. కేంద్ర హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా దీన్ని ప్రారంభించారు. గృహాల ధరలు, క్రయ, విక్రయాలు జరిగిన ఇళ్ల సంఖ్య మొదలైన వివరాలను ప్రతి నెల హెచ్‌పీఐ అందిస్తుంది. హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లలోని గృహాల ధరలను తెలుసుకోవడానికి ఈ ఇండెక్స్‌ ఉపయోగపడుతుంది.  

Updated Date - 2021-06-01T06:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising