ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిలయన్స్... ధాన్యం...

ABN, First Publish Date - 2021-01-11T23:39:52+05:30

రిలయన్స్‌కు ధాన్యమేమిటనుకుంటున్నారా ? ఈ వివరాలు చదవండి. రాయ్చూర్‌ జిల్లా సింధనూర్‌ తాలూకాకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌కు విక్రయిం చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రిలయన్స్‌కు ధాన్యమేమిటనుకుంటున్నారా ? ఈ వివరాలు చదవండి. రాయ్చూర్‌ జిల్లా సింధనూర్‌ తాలూకాకు చెందిన రైతులు తమ ధాన్యాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌కు విక్రయిం చారు. సుమారు వెయ్యి క్వింటాళ్ల ధాన్యాన్ని రిలయన్స్‌కు విక్ర యించారు. స్వస్థ్య ఫార్మర్స్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ(ఎస్‌ఎఫ్‌పీసీ)తో కలిసి రిలయన్స్ రిటైల్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుని సంతకాలు కూడా తీసుకుంది. కర్నాటక ప్రభుత్వం గతేడాది డిసెంబరులో వివాదాస్పదమైన ఏపీఎంసీ బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఆ తరువాత మొదటగా ఓ కార్పొరేట్‌ కంపెనీ.. ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఎస్‌ఎఫ్‌పీ లో సుమారు వెయ్యి మంది రైతులు రిజిస్టరై ఉన్నారు. కర్నాటక అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌(రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) (సవరణ) బిల్లు, 2020 లేదా ఏపీఎంసీ సవరణ బిల్లు అన్నది అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ కమిటీలు (ఏపీఎంసీ)ల అధికారాలకు కోత పెటడుతుంి. న్‌ కార్డు నెంబర్‌ ఉంటేనే... వ్యవసాయోత్సత్తులను కొనుగోలు చేసేందుకు అనుమతించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ ధర కంటే క్వింటాలుకు రూ. 82 వరకు అధికంగా ఇచ్చి రిలయన్స్‌ సంస్థ ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసింది. క్వింటాలుకు రూ. 1,950 చొప్పున చెల్లించింది.  పంట ప్యాకింగ్‌, సింధనూర్‌ గిడ్డంగి వరకు రవాణా ఖర్చులను రైతులు భరిస్తుండగా, ప్రతీ రూ. 100 లావాదేవీకి ఎస్‌ఎఫ్‌పీసీ... 1.5 శాతం కమిషన్‌ తగ్గిస్తుందని నివేదిక వెల్లడించింది. 


క్వాలిటీ నచ్చినపక్షంలో రిలయన్స్‌ ప్రతినిధులు... పంటను కొనుగోలు చేస్తున్నారని, ప్రస్తుతం 500 క్వింటాళ్ల ధాన్యం గిడ్డంగుల్లో నిల్వ ఉందని, ఎప్పుడైనా కొనుగోలు చేయడం జరుగుతుందని భావిస్తున్నామని ఎస్‌ఎఫ్‌పీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మల్లికార్జున్‌ వల్కల్‌దిన్ని వెల్లడించారు. పంట కొనుగోలు చేసిన తరువాత.. రిలయన్స్‌ సంస్థ.. ఎస్‌ఎఫ్‌పీసీ అకౌంట్‌కు డబ్బులు పంపుతుందని, ఆ తరువాత వాటిని రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

Updated Date - 2021-01-11T23:39:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising