ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో రిలయన్స్‌ బెస్ట్‌

ABN, First Publish Date - 2021-10-15T06:33:03+05:30

ఏడాదికి గాను ప్రపంచంలోని 750 అత్యుత్తమ కంపెనీ యాజమాన్యాల (ఎంప్లాయర్స్‌) జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో 750 అత్యుత్తమ ఎంప్లాయర్స్‌  జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్‌  

వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఆర్‌ఐఎల్‌ @ 52

టాప్‌-100లో 4 భారత సంస్థలు

మొత్తం 19 ఇండియన్‌ కంపెనీలకు చోటు

అమరరాజాకు 405వ స్థానం   


న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను ప్రపంచంలోని 750 అత్యుత్తమ కంపెనీ యాజమాన్యాల (ఎంప్లాయర్స్‌) జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) భారత్‌లో బెస్ట్‌ ఎంప్లాయర్‌గా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో ఆర్‌ఐఎల్‌కు 52వ స్థానం దక్కింది. ఆదాయం, లాభం, మార్కెట్‌ విలువపరంగా రిలయన్స్‌ దేశంలోనే అతిపెద్ద కంపెనీ. కరోనా ఆర్థిక సంవత్సరమైన 2020-21లో రిలయన్స్‌ కొత్తగా 75,000 ఉద్యోగాలు కల్పించిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. భారత్‌ నుంచి మొత్తం 19 కంపెనీలకు ఈ లిస్ట్‌లో చోటు దక్కగా.. అందులో 8 బ్యాంక్‌లే కావడం గమనార్హం. టాప్‌-100లో రిలయన్స్‌ సహా 4 కంపెనీలున్నాయి. తెలుగు రాష్ట్రాల కంపెనీల విషయానికొస్తే, అమరరాజా గ్రూప్‌నకు 405వ స్థానం లభించింది. రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. 


ప్రపంచంలో అత్యుత్తమ ఎంప్లాయర్‌గా దక్షిణ కొరియా టెక్నాలజీ కంపెనీ సామ్‌సంగ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికన్‌ దిగ్గజాలైన ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, ఆల్ఫాబెట్‌, డెల్‌, అడోబ్‌ (మొత్తం 7 కంపెనీలు) టాప్‌-10లో స్థానం దక్కించుకున్నాయి. చైనా టెలికమ్యూనికేషన్‌ కంపెనీ హువే, జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూప్‌ సైతం పది అత్యుత్తమ ఎంప్లాయర్లలో ఒకటిగా ఉన్నాయి.  


మార్కెట్‌ రీసెర్చ్‌ కంపెనీ స్టాటిస్టా భాగస్వామ్యంతో ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది. కంపెనీ ప్రతిష్ఠ, ఆర్థిక సామర్థ్యం, నైపుణ్య అభివృద్ధి, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత సహా పలు అంశాల్లో ఉద్యోగులు తమ యాజమాన్యాలకిచ్చిన రేటింగ్‌ ఆధారంగా ర్యాంకింగ్‌లను కేటాయించింది. 58 దేశాల్లో బహుళ జాతి కంపెనీ (ఎంఎన్‌సీ)ల కోసం పనిచేస్తున్న 1.50 లక్షల ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగులను సర్వే చేసింది. 



Updated Date - 2021-10-15T06:33:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising