ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్టీ రుణాలు రూ.7.4 లక్షల కోట్లు

ABN, First Publish Date - 2021-07-27T05:52:43+05:30

కొవిడ్‌ నేపథ్యంలో రియల్టీ రుణాలపై సమీక్ష మొదలైంది. అయితే బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

67% రుణాలు సేఫ్‌: అనరాక్‌ క్యాపిటల్‌


న్యూఢిల్లీ: కొవిడ్‌ నేపథ్యంలో రియల్టీ రుణాలపై సమీక్ష మొదలైంది. అయితే బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు, హెచ్‌ఎ్‌ఫసీలు ఈ రంగానికి ఇచ్చిన 10,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.7.4 లక్షల కోట్లు) రుణాల్లో 6,700 కోట్ల  డాలర్ల (67 శాతం) రుణాలకు ఎలాంటి ఢోకా లేదని అనరాక్‌ క్యాపిటల్‌  ఒక నివేదికలో పేర్కొంది. మిగతా 33 శాతం రుణాల వసూళ్లు మాత్రం ఏదో రూపంలో సమస్యాత్మకమవుతాయని అంచనా వేసింది. ఇందులో 15 శాతం రుణాల అసలుకు ఢోకా ఉండక  పోవచ్చని పేర్కొంది. 18 శాతం రుణాల వసూళ్లు మాత్రం అనుమానమేనని తెలిపింది. వివిధ కారణాలతో బిల్డర్ల ఆర్థిక పరిస్థితి క్షీణించడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 



 ఎన్‌బీఎ్‌ఫసీలతో పోలిస్తే బ్యాంకులు, హెచ్‌ఎ్‌ఫసీల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అంచనా వేసింది. బ్యాంకుల రుణాల్లో 75 శాతం, హెచ్‌ఎ్‌ఫసీల రుణాల్లో 66 శాతం వసూళ్లకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చని తెలిపింది. రియల్టీ రంగానికి ఎన్‌బీఎ్‌ఫసీలు ఇచ్చిన రుణాల్లో 46 శాతం రుణాల వసూళ్ల  కష్టంగానే ఉంటుందని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-07-27T05:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising