ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షోభ సమయంలో ఆర్బీఐ కీలక చర్యలు!

ABN, First Publish Date - 2021-05-05T16:37:17+05:30

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. కరోనా రెండో దశ ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని గవర్నర్ చెప్పారు. తాజాగా ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలపై రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే కరోనాను ఎదుర్కొంటూ ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారని అభిప్రాయపడ్డారు.


కరోనా నిబంధనలను, భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారన్నారు. తదుపరి ఏడాది ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్‌డౌన్‌లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. 


గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:


> గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం


మార్చి 2022 వరకు ఎన్‌పీఏల కోసం నిర్దిష్ట కేటాయింపు 


సూక్ష్మ, చిన్న ,ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం. 


మార్చి 2022 వరకు వరకు కోవిడ్-19 సంబంధిత మౌలిక వసతుల కోసం రూ.50 వేల కోట్ల కేటాయింపు 


చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రత్యేక దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు. ప్రస్తుత రెపో రేటుకు రూ.10,000 కోట్లు, రుణగ్రహీతకు రూ.10 లక్షల వరకు తాజా రుణాలు. అక్టోబర్ 31,2021 వరకు ఈ సదుపాయం


రాష్ట్ర ప్రభుత్వాలకు ఓడీ ఉపశమనం. 36 రోజుల నుంచి 50 రోజులకు గడువు పెంపు 


మే 20న  రెండోసారి 35 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లు

Updated Date - 2021-05-05T16:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising