ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mastercard, RBI: మాస్టర్‌కార్డ్‌కు ఆర్‌బీఐ భారీ షాక్..!

ABN, First Publish Date - 2021-07-15T00:34:17+05:30

ప్రముఖ చెల్లింపుల సంస్థ మాస్టర్‌కార్డ్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాకిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) భారీ షాకిచ్చింది. ఈ నెల 22 నుంచి కొత్తగా భారతీయ వినియోగదారులెవరినీ చేర్చుకోవద్దని తాజాగా ఆదేశించింది. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ విభాగాలు మూడింటికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. చెల్లింపుల సమాచారం నిల్వకు సంబంధించిన నిబంధనలను మాస్టర్‌కార్డ్ ఉల్లంఘించిందని ఆర్‌బీఐ ఈ సందర్భంగా పేర్కొంది. అయితే.. ప్రస్తుత కస్టమర్ల విషయంలో మాస్టర్‌కార్డ్ యథాతథంగా తన సేవలను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 


పేమెంట్ వ్యవస్థల సమాచారాన్నంతా భారత్‌లోనే నిల్వ చేయాలంటూ అన్ని పేమెంట్ సర్వీస్ సంస్థలను ఆర్‌బీఐ 2018 ఏప్రిల్‌లో ఆదేశించింది. ఇందుకు కోసం సంస్థలకు ఆరు నెలల గడువు కూడా విధించింది. కానీ.. మాస్టర్ కార్డ్ ఇప్పటికీ ఆ మార్గదర్శకాలను అమలు చేయకపోవడంతో ఆర్‌బీఐ కొరడా ఝళిపించింది.  అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ సంస్థలపై కూడా ఆర్‌బీఐ ఇటీవల ఇదే రకమైన చర్యలు తీసుకుంది. 2021 మే 1 నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దంటూ ఆదేశించింది.  

Updated Date - 2021-07-15T00:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising