ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జొమాటోలో నేను పెట్టుబడి పెట్టను: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

ABN, First Publish Date - 2021-07-25T23:18:42+05:30

కొత్త తరం టెక్ సంస్థల పట్ల తనకు ఎటువంటి ఆసక్తీ లేదని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరోసారి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కొత్త తరం టెక్ సంస్థల పట్ల తనకు ఎటువంటి ఆసక్తీ లేదని ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరోసారి స్పష్టం చేశారు. జొమాటో లేదా టెస్లా లాంటి టెక్ సంస్థల్లో పెట్టుబడి పెట్టబోనని తేల్చి చెప్పారు. శనివారం ఓ వెబినార్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఏది కొనాలనుకుంటున్నాననేది ముఖ్యమే! కానీ.. ఎంతకు కొంటున్నాననేది అంతకంటే ముఖ్యం. జొమాటో మార్కెట్ విలువ 99 వేల కోట్లైనా.. టెస్లా కంపెనీ విలువ 600 బిలియన్‌ డాలర్లైనా లేదా 6 ట్రిలియన్లైనా నేను వాటిలో పెట్టుబడి పెట్టను. చుట్టుపక్కల జరిగే ప్రతి ‘పార్టీకీ’ నేను వెళ్లను. హ్యాంగోవర్ అనేది మరుసటి రోజు మాత్రమే వస్తుంది’’ అని రాకేశ్ కామెంట్ చేశారు. తనకు మార్కెట్‌ విలువ కంటే క్యాష్ ‌ఫ్లో బిజినెస్ మోడలే ఎక్కువగా నచ్చుతుందని చెప్పారు. ‘‘బిజినెస్ మోడల్, వ్యాపార సుస్థిరత కంటే మార్కెట్ విలువకు అధిక ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ వెబినార్‌లో రాకేశ్‌తో పాటూ ఇన్ఫోసిస్ సంస్థ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పాయ్ కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T23:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising