ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమేనా?

ABN, First Publish Date - 2021-02-02T02:29:14+05:30

ఇకపై స్మార్ట్‌ఫోన్ కొనాలంటే కొద్దిగా ఆలోచిస్తారేమో! ఎందుకంటే, స్మార్ట్‌ఫోన్ రేట్లు ఇకపై ఆకాశంలో విహరించనున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇకపై స్మార్ట్‌ఫోన్ కొనాలంటే కొద్దిగా ఆలోచిస్తారేమో! ఎందుకంటే, స్మార్ట్‌ఫోన్ రేట్లు ఇకపై ఆకాశంలో విహరించనున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీకి పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ చార్జర్లు, ఇతర విడిభాగాలపై ఇప్పటి ఉన్న కస్టమ్ డ్యూటీ మినహాయిపులను ఎత్తివేశారు.


మరికొన్ని విడిభాగాలపై ఇప్పటి వరకు దిగుమతి సుంకం సున్నాగా ఉండగా, ఇప్పుడు వాటిపై ప్రభుత్వం 2.5 శాతం సుంకం విధించింది. ప్రభుత్వ తాజా నిర్ణయాల్లో కొన్ని రేపటి (2వ తేదీ) నుంచే అమల్లోకి రానుండగా, మరికొన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తమపై పడే భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైకి నెట్టేస్తాయి కాబట్టి స్మార్ట్‌ఫోన్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. 


బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి నిర్మల మాట్లాడుతూ.. దేశంలో తయారీ రంగం క్రమంగా పుంజుకుంటోందని, ఇప్పుడు మొబైల్స్, చార్జర్స్ వంటి వాటిని ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. అయితే దీనిని మరింత పెంచే లక్ష్యంతో  చార్జర్, మొబైల్స్ విడిభాగాలపై ఉన్న మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. కొన్నింటిపై ప్రస్తుతం ‘సున్నా’గా ఉన్న దిగుమతి సుంకాన్ని ఇప్పుడు 2.5 శాతానికి పెంచినట్టు వివరించారు.

Updated Date - 2021-02-02T02:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising