ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎఫ్ ఖాతా... ప్రతీ నెలా డబ్బు జమ...

ABN, First Publish Date - 2021-05-18T01:18:27+05:30

సాధారణంగా పీఎఫ్ ఖాతాల్లోని డబ్బును ఓ నిర్ణీత సమయంలో మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుందన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సాధారణంగా పీఎఫ్ ఖాతాల్లోని డబ్బును ఓ  నిర్ణీత సమయంలో మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుందన్న విషయం తెలిసిందే. కాగా... ఈపీఎఫ్ ఖాతా ఉన్న వారు... ప్రతీనెల డబ్బులు పొందే అవకాశం అందుబాటులోకొచ్చింది. వివరాలిలా ఉన్నాయి.


రిటైర్మెంట్ స్కీమ్‏లో ఈపీఎఫ్ పథకం కూడా ఒకటి. దీంతో... పీఎఫ్ ఖాతా ఉన్నవారికి పింఛను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే ఈ క్రమంలోనే ఉద్యోగుల నెలవారీ జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాకు వెళుతుందన్నది తెలిైసిన విషయమే. మూల వేతనం, డీఏలో 12 శాతం డబ్బులు పీఎఫ్ అకౌంట్‌లో జమవుతాయి.


ఇక అదే సమయంలో ఉద్యోగి కంపెనీ కూడా పీఎఫ్ అకౌంట్‏లో 12 శాతం మొత్తాన్ని జమ చేస్తుంది. ఇక డబ్బు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి కొన్ని రకాల నిబంధనలు అమల్లో ఉన్నాయి. అలాగే పీఎఫ్ ఖాతాదారులు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల డబ్బులు పొందాలనే భావిస్తే.. ఒక షరతు కూడా ఉంది. అదేమిటంటే... పీఎఫ్ అకౌంట్ కు కనీసం పదిహేనేళ్లు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలాంటి అంతరాయం లేకుండా. ఈ క్రమంలో... పీఎఫ్ ఖాతాదారులకు కనీసం రూ. వెయ్యి నుంచి పెన్షన్ పొందే వెసులుబాటు ఉంటుంది. దంటే పీఎఫ్ వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.

Updated Date - 2021-05-18T01:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising