ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...record

ABN, First Publish Date - 2021-10-27T14:22:17+05:30

రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ బుధవారం పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ బుధవారం పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి.దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు 35 పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.107.94,డీజిల్ లీటరు ధర రూ.96.67కి పెరిగాయి.దీంతో ఇంధన ధరలు బుధవారం రికార్డు స్థాయికి ఎగిశాయి. విమానయాన టర్బైన్ ఇంధనం ఏటీఎఫ్ లేదా జెట్ ఇంధనం విమానయాన సంస్థలకు విక్రయించే ధర కంటే ఇప్పుడు పెట్రోల్ ధర 36.63 శాతం ఎక్కువ కావడం విశేషం.నాలుగు మెట్రో నగరాల్లో పోలిస్తే ఇంధన ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయని ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ ల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబైలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.113.80, డీజిల్ లీటరుకు రూ. 104.75 కు పెరిగింది.


 చెన్నైలో పెట్రోల్ ధరలు లీటరు మార్కు రూ. 105కి చేరింది. చెన్నైలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.104.83 కు పెరిగింది.హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 36 పైసలు పెరిగి రూ.112.27కు చేరింది. డీజిల్‌ ధర లీటరుపై 38 పైసలు పెరిగి రూ.105.46కు చేరింది.ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తాయి.ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు నిల్వలు ఊహించిన దాని కంటే ఎక్కువగా పెరిగాయి.


Updated Date - 2021-10-27T14:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising