ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్, డీజిల్ ధరలు తగగ్గనున్నాయా ?

ABN, First Publish Date - 2021-04-04T22:57:59+05:30

కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు క్షీణించడంతో ఇక్కడ కూడా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు క్షీణించడంతో ఇక్కడ కూడా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం కూడా కనిపించింది. కిందటి నెలలో చివరి పదిహేను రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మూడుమార్లు క్షీణించాయి. ధరలు వరుసగా ఐదో రోజు స్థిరంగా ఉన్నాయి.


అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరగడం, ఒపెక్ సహా వివిధ దేశాలు ఉత్పత్తి పెంచడం వంటి కారణాలతో ధరలు తగ్గాయి. కాగా... కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే ‘పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రమంత్రులు పలువురు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్ కారణం’. గతంలో కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. చమురు ధరలు రానున్న రోజుల్లో కాస్త తగ్గవచ్చునని ప్రధాన్ అన్నారు. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ సానుకూలత సాధిస్తోందని అంటున్నారు. 


పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, రానున్న రోజుల్లో మరింత తగ్గవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ తగ్గుదల ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తామని గతంలోనే చెప్పామని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అణుగుణంగా ఇక్కడ ధరలు పెరుగుతున్నాయని గతంలో చెప్పారు.

Updated Date - 2021-04-04T22:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising