ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుసగా ఆరవ రోజు... స్థిరంగా పెట్రోల్ ధరలు

ABN, First Publish Date - 2021-07-23T20:50:32+05:30

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు(ఆదివారం నుండి) స్థిరంగా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు(ఆదివారం నుండి) స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ధరలకు అణుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయన్న విషయం తెలిసిందే. కాగా... ఈ రోజు (శుక్రవారం, జూలై 23) ధరలు స్థిరంగా ఉన్నాయి. గత శనివారం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యథాతథంగా ఉన్నాయి. శనివారం మాత్రం  స్వల్పంగా పెరిగాయి. చివరిసారి... గత శనివారం పెట్రోల్ ధర నిన్న 30 పైసలు పెరిగింది. ఈ నెలలో...  ఈ ఇరవై మూడు రోజుల్లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల విషయానికొస్తే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ 71.85 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 73.76 డాల్ల వద్ద ఉన్నాయి.


శనివారం పెట్రోల్ ధరలు పెరిగినా, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గతవారం పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 101.84, లీటర్ డీజిల్ రూ. 89.87గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర ఢిల్లీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ. 107.83, డీజిల్ రూ. 97.45గా ఉంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 110 దాటాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలోరూ. వంద దాటింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105.83, లీటర్ డీజిల్ రూ. 97.76గా ఉన్నాయి.

Updated Date - 2021-07-23T20:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising