ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు ఇష్టపడి ముందుకు రావాలి

ABN, First Publish Date - 2021-02-23T06:06:52+05:30

వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడాలి. అప్పుడే ప్రపంచం కొవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడుతుంది. అందుకు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాలని యూఎస్‌ఎఫ్‌డీఏకు చెందిన సెంటర్‌ ఫర్‌ బయోలాజిక్స్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వ్యాక్సిన్‌పై విశ్వాసాన్ని కల్పించాలి: పీటర్‌ మార్క్స్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడాలి. అప్పుడే ప్రపంచం కొవిడ్‌ మహమ్మారి నుంచి బయటపడుతుంది. అందుకు ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాలని యూఎస్‌ఎఫ్‌డీఏకు చెందిన సెంటర్‌ ఫర్‌ బయోలాజిక్స్‌ ఎవల్యూషన్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ పీటర్‌ మార్క్స్‌ అన్నారు. బయోఏషియా సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, అందుబాటులోకి తీసుకురావడంలో ఎఫ్‌డీఏ కీలక పాత్ర పోషించింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి ప్రామాణికాలను తీసుకువచ్చాం. ఇది వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆలస్యం లేకుండా నిరంతరాయంగా క్లినికల్‌ పరీక్షలకు మార్గం సుగమం చేయడం ద్వారా వ్యాక్సిన్‌ తయారీదారులు చాలా త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. 

వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో కొంత మందికి రియాక్షన్‌ రావడాన్ని ఫైజర్‌, మోడెర్నా గమనించాయని చెప్పారు. బయోసిమిలర్ల పరిశ్రమ భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పీటర్‌ అన్నారు. 


Updated Date - 2021-02-23T06:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising