ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ నుంచి ‘సరళ్‌’ పెన్షన్‌ పథకం

ABN, First Publish Date - 2021-01-26T07:01:07+05:30

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యక్తిగత ప్రామాణిక యాన్యుటీ బీమా పథకానికి ఆమోద ముద్ర వేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యక్తిగత ప్రామాణిక యాన్యుటీ బీమా పథకానికి ఆమోద ముద్ర వేసింది. అన్ని జీవిత బీమా సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ఈ పథకం ప్రారంభించాలని ఆదేశించింది. ఈ పథకానికి ముందు కంపెనీ పేరు చేర్చి ‘సరళ్‌’ యాన్యుటీ పథ కం ప్రారంభించాలని కోరింది. ఈ పథకంలో రెండు ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి లైఫ్‌ యాన్యుటీ, రెండోది జాయింట్‌ లైఫ్‌ యాన్యుటీ. ఇందులో లైఫ్‌ యాన్యు టీ ఆప్షన్‌ కింద కొనుగోలు ధర పూర్తిగా చెల్లిస్తారు. జాయిం ట్‌ లైఫ్‌ యాన్యుటీ కింద మొదటి పాలసీదారుడి మరణం తర్వాత రెండో యాన్యుటీదారుడికి నూరు శాతం యాన్యుటీతో పాటు పాలసీ  కొనుగోలు ధర మొత్తాన్ని చెల్లిస్తారు 


ఈ పథకం కింద మెట్యూరిటీ ప్రయోజనాలు ఉండవు

పాలసీ అమలైన ఆరు నెలల్లోపు పాలసీదారుడు లేదా అతడి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం తలెత్తితే పాలసీని ఎప్పుడైనా సరెండర్‌ చేయవచ్చు

కనీస నెలవారీ యాన్యుటీ రూ.1,000

యాన్యుటీ గరిష్ఠ చెల్లింపులపై పరిమితులు

పాలసీ ప్రీమియం నిర్ణయంపై కంపెనీల ఇష్టం

Updated Date - 2021-01-26T07:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising