ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పే లేటర్’ ... ఐసీఐసీఐ ఆఫర్...

ABN, First Publish Date - 2021-02-23T23:04:19+05:30

ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు ఓ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే... ‘బై నౌ పే లేటర్’. ఈ క్రమంలో... కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఆఫర్ లో కొనుగోళ్ళు జరిపిన తర్వాత... ఆ తర్వాతి నెల 15 వ తేదీలోగా డబ్బు చెల్లించవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఐసీఐసీఐ బ్యాంకు తన కస్టమర్లకు ఓ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే...  ‘బై నౌ పే లేటర్’.  ఈ క్రమంలో... కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఆఫర్ లో కొనుగోళ్ళు జరిపిన తర్వాత... ఆ తర్వాతి నెల 15 వ తేదీలోగా డబ్బు చెల్లించవచ్చు. ఈ 45 రోజుల వరకు వడ్డీ భారం ఉండబోదు. ఈ ఆఫర్ కేవలం ఐసీఐసీఐ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా  ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.


ఇవేకాకుండా... ఐసీఐసీఐ పాకెట్స్ యాప్, బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఆఫర్‌ను పొందే వెసులుబాటుంది. ఈ సర్వీసులు యాక్టివేట్ చేసుకున్న తర్వాత మన పేరుపై ‘పే లేటర్ అకౌంట్’ నెంబర్ ఏర్పాటవుతుంది. పే లేటర్ సర్వీసుల ద్వారా నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేయొచ్చు. 


అమెజాన్, పేటీఎం, మొబిక్విక్, ఫ్లిప్ కార్ట్, ఫోన్ పే వంటి ఆన్‌లైన్ మార్కెట్స్ ద్వారా చెల్లింపులు జరుపుకునే వెసులుబాటు ఈ ఆఫర్ లో ఉంది. అయితే... ఐసీఐసీఐ పే లేటర్ ద్వారా కేవలం షాపింగ్ మాత్రమే చేయడానికి వీలుంది. ఇతరుల బ్యాంక్ ఖాతాకు నగనదు బదిలీకి అవకాశముండదు.  కేవలం షాపింగ్ చేయడానికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

Updated Date - 2021-02-23T23:04:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising