ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన ల్యాప్‌టాప్‌... మన సాఫ్ట్‌వేర్,,,...

ABN, First Publish Date - 2021-02-27T02:25:22+05:30

ల్యాప్‌టాప్ లో ర్యామ్‌ పాడైపోతే... అదే కంపెనీకి చెందిన కొత్త ర్యామ్‌ కొనుక్కొని వేసుకుంటాం. అయితే... అలా కాకుండా డెల్‌ కంపెనీ ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ కంపెనీకి చెందిన ర్యామ్‌ను బిగించుకుంటే ఎలా ఉంటుంది ?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ల్యాప్‌టాప్ లో ర్యామ్‌ పాడైపోతే... అదే కంపెనీకి చెందిన కొత్త ర్యామ్‌ కొనుక్కొని వేసుకుంటాం. అయితే... అలా కాకుండా డెల్‌ కంపెనీ ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ కంపెనీకి చెందిన ర్యామ్‌ను బిగించుకుంటే ఎలా ఉంటుంది ? అలాగే.. హెచ్‌పీ కంపెనీ గ్రాఫిక్‌ కార్డు బాగా పనిచేస్తుందని భావిస్తు, దానిని... ‘ఎసర్‌’ ల్యాప్‌ట్యాప్‌ లోనూ వేసుకుని వాడుకోవచ్చు. అంటే... ఒక ల్యాప్‌టాప్‌లో మనకు నచ్చిన కాంపోనెంట్స్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది ? ఇది సాధ్యపడేదే. తాజాగా మార్కెట్‌లోకి రాబోతున్న కొత్త ల్యాప్‌టాప్‌ దీనిని నిజం చేయనుంది. వివరాలిలా ఉన్నాయి. 


ఫ్రేమ్‌ వర్క్‌ అనే స్టార్టప్‌ మార్కెట్లోకి తీసుకొస్తున్న ఈ కొత్త ల్యాప్‌ట్యాప్‌లో మనకు నచ్చిన కంపెనీ భాగాలను అమర్చుకునే వెసులుబాటు ఉంటుంది. స్క్రీన్  మొదలుకుని కీ బోర్డ్‌ వరకు, ర్యామ్‌ సహా చివరకు మధర్‌ బోర్డ్‌ను కూడా మార్చుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. దీంతో ల్యాప్‌టాప్‌లో ఏదైనా కాంపోనెంట్‌ పాడైతే అదే కంపెనీకి చెందిన కాంపోనెంట్‌ను కొనుగోలు చేయాల్సి అవసరముండబోదు. 


ఫ్రేమ్‌ వర్క్‌ కంపెనీ ఫౌండర్‌ నిరవ్‌ ఈ విషయమై మాట్లాడుతూ... ‘వినియోగదారుడు తన ల్యాప్‌టాప్‌ మరమ్మత్తులు, అప్‌గ్రేడ్‌ను చాలా సులభంగా చేసుకోవాలనేదే ఈ స్టార్టప్‌ ప్రధాన లక్ష్యం’  అని చెప్పారు. ‘ఒక వేళ మ్యాక్‌ బుక్‌ తెర పగిలిపోతే... లిడ్‌ అసెంబుల్ మొత్తం మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల సీఎన్‌సీ అల్యుమినియం హౌసింగ్‌, వెబ్‌ క్యామ్‌, ఫ్రంట్‌ గ్లాస్‌ లాంటి వాటినన్నింటినీ మార్చాకోవాల్సి ఉంటుంది. ఇవి... ఖర్చు, సమయంతో కూడుకున్న అంశాలు. కానీ ఫ్రేమ్‌ వర్క్‌ ల్యాప్‌టాప్‌లో మాత్రం కేవలం స్క్రీన్‌ను మార్చుకుంటే సరిపోతుందని నివర్‌ తెలిపారు.


ఇదిలా ఉంటే వేసవిలో విడుదల చేయనున్న ఈ ల్యాప్‌టాప్‌ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఇక ఫ్రేమ్‌వర్క్‌ ఫౌండర్‌ నివర్‌ పాటెల్‌ ఈ స్టార్టప్‌ ప్రారంభించకముందు ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌లో మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశాడు. మరి ఎన్నో వినూత్న ఫీచర్లతో రాబోతున్న ఈ కొత్త రకం ల్యాప్‌టాప్‌ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2021-02-27T02:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising