ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిరిండియా రెండో దశ విక్రయ ప్రక్రియ... వీడీఆర్ కు కేంద్రం అనుమతి..!

ABN, First Publish Date - 2021-04-16T01:50:10+05:30

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి రెండో దశ ప్రారంభమైనట్లు వినవస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలో ఫైనాన్షియల్‌ బిడ్లకు ఆహ్వానం పలుకుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి రెండో దశ ప్రారంభమైనట్లు వినవస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలో ఫైనాన్షియల్‌ బిడ్లకు ఆహ్వానం పలుకుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఎయిరిండియా కొనుగోలులో భాగంగా ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలిచ్చే వీడీఆర్‌కు బిడ్డర్లను  అనుమతించినట్లు సమాచారం. మొత్తంమీద... ఎయిరిండియా విక్రయం ఫైనాన్షియల్‌ బిడ్డింగ్‌ దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో... రసంస్థ అమ్మకానికి సంబంధించిన ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తికావచ్చని చెబుతున్నారు. మరిన్ి వివరాలిలా ఉన్నాయి. 


పధ్నాలుగేళ్ళ క్రితం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా సంస్థల  విలీనం జరిగిన తర్వాత... సంస్థ భారీ నష్టాలలో నడుస్తూవస్తోంది. కాగా...  ఎయిరిండియాలో తన వాటాను కేంద్రం పూర్తిగా విక్రయించనుంది. కొనుగోలుదారుడికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటా, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్, కార్గో సేవలనందించే ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం వాటాల చొప్పున అందనున్నాయి. ఎయిరిండియా కొనుగోలుకి టాటా గ్రూప్‌ సహా పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ బిడ్స్‌ దాఖలు చేయడం తెలిసిందే. గతేడాది డిసెంబరు నాటికి ప్రాథమిక బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తికాగా, సమీక్ష అనంతరం... అర్హతగల కంపెనీలను వీడీఆర్‌కు కేంద్రం అనుమతిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-04-16T01:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising