ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రప్టో కరెన్సీ కాదు... క్రిప్టో అస్సెట్స్..?

ABN, First Publish Date - 2021-12-07T23:54:23+05:30

క్రిప్టో కరెన్సీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా... క్రిప్టో హోల్డర్‌లు తమ ఆస్తులను ప్రకటించేందుకు గడువును ప్రకటించే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా వినవస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా... క్రిప్టో హోల్డర్‌లు తమ ఆస్తులను ప్రకటించేందుకు గడువును ప్రకటించే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా వినవస్తోంది. క్రిప్టోకరెన్సీలను ఆర్థిక ఆస్తులుగా వర్గీకరించే విషయాన్ని అధికారులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. వాటిని పర్యవేక్షించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీని నియమించే అవకాశమున్నట్లుగా వినవస్తోంది.


భారీ సంఖ్యలోనే ఉన్న క్రిప్టో హోల్డర్‌లను ప్రభావితం చేసే పూర్తి నిషేధం కాకుండా, కేవలం  క్రిప్టోకరెన్సీలను నియంత్రించేం దిశగా మాత్రమే ఉండేలా క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బిల్లులో 'క్రిప్టోకరెన్సీలు' కాకుండా 'క్రిప్టోఅసెట్స్' అనే పదాన్ని ఉపయోగించే అవకాశమున్నట్లుగా చెబుతున్నారు. సెంట్రల్ బ్యాంక్ దాని సొంత డిజిటల్ కరెన్సీని సృష్టించే ప్రణాళికను సూచించదని వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా... ‘ఉల్లంఘనులు’కు రూ. 20 కోట్ల(2.7 మిలియన్ డాలర్లు) జరిమానా లేదా ఒకటిన్నర సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు.  చిన్న పెట్టుబడిదారులను రక్షించడానికి, క్రిప్టో ఆస్తులలో పెట్టుబడి పెట్టేందుకు కనీస థ్రెషోల్డ్‌ను ప్రభుత్వం సూచించే అవకాశాలున్నాయని సమాచారం.


దేశంలో క్రిప్టో కరెన్సీ రంగాన్ని పెంచేందుకు కేంద్రం ఎలాంటి ప్రణాళికలనూ సిద్ధం  చేయలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు వెల్లడించిన విషయం తెలిసిందే. కొత్త పరిణామాలకణుగుణంగా అన్ని ప్రైవేటు  క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని ప్రతిపాదించిన మునుపటి బిల్లును ప్రభుత్వం మళ్ళీ రూపొందించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిందటి వారం వెల్లడించిన విషయం తెలిసిందే. దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదీ లేదని ఆమె ఆ సందర్భంలో స్పష్టం చేశారు. క్రిప్టో-విశ్లేషణ సంస్థ ‘చైనాలిసిస్’ అక్టోబరు నివేదిక ప్రకారం... భారత్‌లో క్రిప్టో మార్కెట్ జూన్ 2021 నాటికి ఆరు రెట్టకు పైగాద పెరిగింది. కాగా...  డిజిటల్ కరెన్సీల ద్వారా వచ్చే లాభాలపై పన్ను విధించే అంాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. క్రమబద్ధీకరించని వ్యాపార స్వభావం కారణంగా వర్చువల్ నాణేలకు సంబంధించిన లావాదేవీల కోసం కఠినమైన నిబంధనలను విధించాలని భావిస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రధాని మోదీ డిజిటల్ కరెన్సీపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరించని క్రిప్టో మార్కెట్‌లు  మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు మార్గాలుగా మారడాన్ని అనుమతించరాదన్న నిర్ణయం జరిగిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-07T23:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising