టెలివిజన్ ప్రసారాలకు ‘నెక్స్ట్‌హబ్’
ABN, First Publish Date - 2021-10-29T08:48:33+05:30
డిజిటల్ టీవీ ప్రసారాలు, బ్రాండ్‌బ్యాండ్ సేవలతోపాటు ఓటీటీ, వైఫై సేవలు వంటి అదనపు డిజిటల్ సేవలను అందించడానికి నెక్స్ట్‌డిజిటల్ ‘నెక్స్ట్‌హబ్’ను ప్రారంభించింది.
ప్రారంభించిన నెక్స్ట్‌డిజిటల్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డిజిటల్ టీవీ ప్రసారాలు, బ్రాండ్‌బ్యాండ్ సేవలతోపాటు ఓటీటీ, వైఫై సేవలు వంటి అదనపు డిజిటల్ సేవలను అందించడానికి నెక్స్ట్‌డిజిటల్ ‘నెక్స్ట్‌హబ్’ను ప్రారంభించింది. హిందుజా గ్రూప్‌నకు చెందిన నెక్స్ట్‌డిజిటల్.. శాటిలైట్, కేబుల్ ద్వారా టెలివిజన్ ప్రసారాలు, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. హెడ్‌ఎండ్-ఇన్-ద-స్కై టెక్నాలజీ ఆధారంగా ‘నెక్స్ట్‌హబ్’ పేరుతో అడ్వాన్స్‌డ్ డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఏడీడీఎ్‌స)ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని నెక్స్ట్‌డిజిటల్ ఎండీ, సీఈఓ విన్స్‌లే ఫెర్నాండెజ్ తెలిపారు. డిజిటల్ టెలివిజన్ ప్రసారాల్లోని లాస్ట్ మైల్ ఓనర్లు (ఎల్‌ఎంఓ) టెలివిజన్ ప్రసారాలకు తాము పెట్టుబడులు పెట్టకుండానే ప్లగ్-అండ్-ప్లే సొల్యూషన్ అయిన నెక్స్ట్‌హబ్ ద్వారా ప్రసారాలను తీసుకుని వినియోగదారులకు అందించవచ్చన్నారు. ఎల్‌ఎంఓలు కనీసం 650 టెలివిజన్ చానెళ్లను పొందవచ్చన్నారు. దేశవ్యాప్తంగా 40 నెక్స్ట్‌హబ్‌లను గురువారం ప్రారంభించా రు. ఇందులో 16 ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఉన్నాయి.
Updated Date - 2021-10-29T08:48:33+05:30 IST