ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కొత్త కంపెనీలు తగ్గాయ్‌..

ABN, First Publish Date - 2021-01-02T06:47:33+05:30

గత ఏడాది (2020) లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) వద్ద నమోదైన కంపెనీలు తగ్గి 1200లకు పరిమితమయ్యా యి. 2018లో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు 2,000

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2020లో నమోదైనవి 1,200

కనుమరుగైనవి 500

కొత్త కంపెనీల నమోదుపై కొవిడ్‌ ప్రభావం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఏడాది (2020) లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) వద్ద నమోదైన కంపెనీలు తగ్గి 1200లకు పరిమితమయ్యా యి. 2018లో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు 2,000 ఉండగా 2019లో ఈ సంఖ్య 3,000లకు పెరిగింది. కంపెనీల నమోదుపై కొవిడ్‌ ప్రభావం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్‌ఓసీ కార్యాలయం ఏఆర్‌ఓసీ సాయి శంకర్‌ లండా తెలిపారు. ఏపీలో ఆర్‌ఓసీ కార్యాలయం ఏర్పాటు చేసి రెండే ళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐసీఎ్‌సఐ, ఐసీఏఐ సభ్యులు సహా ఆర్‌ఓసీ అధికారులు పాల్గొన్నారు.


వెసులుబాటుకు ప్రత్యేక పథకాలు: ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు లేకపోవడం, నిధుల సమీకరణ చేయలేకపోవడం తదితర కారణాలతో గత ఏడాది 500 కంపెనీలు స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నాయి. 2019 లో ఈ విధంగా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్న కంపెనీలు 525 ఉండగా.. ఆస్తులు, అప్పుల పట్టికను, ఇతర పత్రాలను సమర్పించని కారణంగా 971 కంపెనీలను ఆర్‌ఓసీ రద్దు చేసింది. 2020లో కొవిడ్‌ కారణంగా నిబంధనలు పాటించని కంపెనీలను రద్దు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. జరిమానాల రద్దు, బ్యాలెన్స్‌ షీట్‌ సమర్పించడానికి గడువు మొదలైన చర్యలు తీసుకుందని సాయి శంకర్‌ అన్నారు.


కంపెనీస్‌ ఫ్రెష్‌ స్టార్ట్‌ స్కీమ్‌ (సీఎ్‌ఫఎ్‌సఎస్‌-2020) కింద కంపెనీలకు, ఎల్‌ఎల్‌పీ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ 2020 కింద ఎల్‌ఎల్‌పీ కంపెనీలకు ఈ వెసులుబాట్లు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కల్పించింది. అలాగే ఏజీఎం నిర్వహించడానికి అన్ని కంపెనీలకు గడువును 2020 సెప్టెంబరు నుంచి డిసెంబరు 31 వరకూ పొడిగించింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్‌ఓసీ కార్యాలయంలో గత ఏడాది డిసెంబరు చివరి నాటికి నమోదై ఉన్న మొత్తం కంపెనీలు దాదాపు 33,800. ఇందులో 23,000 కంపెనీలు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో 150 లిస్టెడ్‌ కంపెనీలు. 

Updated Date - 2021-01-02T06:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising