ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జియో, ఎయిర్‌టెల్‌పై వినియోగదారుల ఆగ్రహం

ABN, First Publish Date - 2021-11-29T21:41:35+05:30

ప్రిపెయిడ్ ధరల పెంపును నిరసిస్తూ ట్విట్టర్‌లో నెటిజెన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. నేటి ఇండియా ట్రెండ్స్‌లో ‘బాయ్‌కాట్ జియో వొడా ఎయిర్‌టెల్’ అనే హ్యాష్‌ట్యాగ్ హల్‌చల్ చేస్తోంది. దీనికి నెటిజెన్ల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు వస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా టెలికాం సంస్థలు ప్రవర్తిస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొద్ది రోజుల వ్యవధిలో ఇరు సంస్థలు ప్రిపెయిడ్ టారిఫ్స్‌ను పెంచడంపై టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ సంస్థలపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సంస్థలతో పాటు ఐడియాపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్ఎల్‌ను ఎంచుకోవాలంటూ సూచించడం గమనార్హం. అంతే కాకుండా ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేసే ఈ సంస్థలు డేటా, నెట్‌వర్క్ విషయంలో స్పీడ్ మెంటేన్ చేయడం లేదని మండిపడుతున్నారు. అంతే కాకుండా ప్రపంచం మొత్తం 30 రోజుల ప్యాకేజీని అందిస్తుంటే ఇండియాలోని టెలికాం సంస్థలు మాత్రం 28 రోజుల ప్లాన్‌తో వినియోగదారులను అయోమయానికి గురి చేస్తూ డబ్బులు గుంజుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.


ప్రిపెయిడ్ ధరల పెంపును నిరసిస్తూ ట్విట్టర్‌లో నెటిజెన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. నేటి ఇండియా ట్రెండ్స్‌లో ‘బాయ్‌కాట్ జియో వొడా ఎయిర్‌టెల్’ అనే హ్యాష్‌ట్యాగ్ హల్‌చల్ చేస్తోంది. దీనికి నెటిజెన్ల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు వస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా టెలికాం సంస్థలు ప్రవర్తిస్తే నిఘా పెట్టి నియంత్రించాల్సిన ట్రాయ్ నిద్రవాస్థలో ఉందా అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. మీమ్స్, వీడియో క్లిప్పులు ఉపయోగిస్తూ మూడు టెలికాం సంస్థలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొంత మంది నెటిజెన్లు అయితే జియో, ఎయిర్‌టెల్, వొడా నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారుతూ, వాటికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ మిగతా వారు కూడా మారాలంటూ ప్రచారం చేస్తున్నారు.


జియో, ఎయిర్‌టెల్, వొడా సంస్థలపై నెటిజెన్లు వేస్తున్న ట్వీట్లలతో కొన్ని...



















Updated Date - 2021-11-29T21:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising