ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణంగా దెబ్బతినన్న నవభారత్ వెంచర్స్ ‘షేర్’...

ABN, First Publish Date - 2021-08-06T01:42:41+05:30

నవ భారత్ వెంచర్స్ కంపెనీ ఇటీవలి కాలంలో ఓ రేంజ్‌లో నష్టాలను మూటగట్టుకుంటోంది. షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నవ భారత్ వెంచర్స్ కంపెనీ ఇటీవలి కాలంలో ఓ రేంజ్‌లో నష్టాలను మూటగట్టుకుంటోంది. షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇంట్రా-డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో నవ భారత్ వెంచర్స్ షేర్లు 15 శాతం తగ్గి రూ. 107.20 కి చేరుకున్నాయి. జూన్ 2021 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గణనీయంగా తగ్గిపోయింది. గతేడాదితో పోల్చితే పన్ను తర్వాతి లాభం వార్షికంగా 60 శాతం క్షీణించి రూ. 38.45 కోట్లకు పడిపోయింది. త్రైమాసికంలో ఆదాయం 6.9 శాతం తగ్గి రూ. 557.93 కోట్లకు చేరుకుంది.


అయితే ఆదాయం తగ్గడానికి గల కారణాలను నవభారత్ వెంచర్స్ వెల్లడించింది. భారతదేశంలో విద్యుత్తు సమస్య ఇబ్బందికరంగా మారిన విషయం తెలిసిందే. జాంబియాలోని ఒక పవర్ యూనిట్ మరమ్మత్తుల కిందనే ఉండిపోవడం, సంస్థ వ్యాపారంలో ప్రముఖంగా ఉన్న ఫెర్రో  అల్లాయ్స్ తయారీకి ఆక్సిజన్ ప్రొడక్షన్ ఇబ్బందికరంగా మారడం... తదితర పరిణామాలు... కంపెనీని నష్టాల ఊబిలోకి నెట్టాయి. తర్వాత ఆక్సిజన్ సరఫరా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఫలితంగా ఉత్పత్తి తగ్గడం, తద్వారా నష్టాలు... వెరసి కంపెనీ షేర్ తగ్గుముఖం పట్టింది.

Updated Date - 2021-08-06T01:42:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising