ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ జాబితాలో పన్నెండవ స్థానానికి పడిపోయిన ముఖేష్...

ABN, First Publish Date - 2021-01-26T21:02:31+05:30

అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి 5.2 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. అదీ ఒక్క రోజులోనే. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ... ఇది పచ్చి నిజం. ఎలా అంటే... వివరాలి వీ... స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి 5.2 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. అదీ ఒక్క రోజులోనే. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ... ఇది పచ్చి నిజం. ఎలా అంటే... వివరాలి వీ... స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ఇక... కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉండడం సహజం. అయితే... దీనికి తోడు అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలు ప్రభావాన్ని చూపాయి. 


ఇక... దేశీయ అతిపెద్ద కంపెనీ అయినరిలయన్స్ ఇండస్ట్రీస్ దారుణంగా పతనమైంది. ఈ స్టాక్ ఏకంగా 5.58 శాతం నష్టపోయి రూ.1,935 వద్ద ముగిసింది. కిందటి సెషన్‌లో రూ .2,050 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఇక... ఈ రోజు రూ. 114 కు పైగా పడిపోయింది.


ఈ క్రమంలో... రిలయన్స్ నిన్న(సోమవారం) భారీగా నష్టపోవడంతో ముఖేష్ అంబానీ సంపద 5.2 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయినట్లైంది.. నిఫ్టీ 50 స్టాక్స్‌లోని ఎన్నో కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఆదాయం ఎక్కువగా కోల్పోయింది. నిన్నటి ట్రేడింగ్‌లో సగటున నిమిషానికి 13 మిలియన్ డాలర్లు నష్టపోయారు ముఖేష్ అంబానీ. ఈ నష్టంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీల్లో ముఖేష్ 12 వ స్థానానికి పడిపోయారు. 

Updated Date - 2021-01-26T21:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising