ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక విడిగా మోటార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం!

ABN, First Publish Date - 2021-01-25T07:53:55+05:30

కొత్త మోటార్‌ వాహనం కొనేటప్పుడు చెల్లించే బీమా ప్రీమియం స్వరూపం మారే సూచనలు కనిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సన్నాహాలు చేస్తున్న ఐఆర్‌డీఏఐ


న్యూఢిల్లీ: కొత్త మోటార్‌ వాహనం కొనేటప్పుడు చెల్లించే బీమా ప్రీమియం స్వరూపం మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆటోమొబైల్‌ డీలరే వాహన ధరతో కలిసి ఆటోమొబైల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం వసూలు చేస్తున్నాడు. ఆ ప్రీమియాన్ని డీలరే బీమా కంపెనీకి తన ఖాతా నుంచి చెల్లిస్తున్నాడు. దీంతో బీమా కంపెనీతో ఆటోమొబైల్‌ డీలర్‌కు ఉన్న సంబంధాలు, వారి నుంచి అతడికి లభించే కమిషన్‌, డిస్కౌంట్లు, వాహన కొనుగోలుదారుడికి లభించే కవరేజీ ఆప్షన్ల గురించి కొనుగోలుదారులకు ఎలాంటి అవగాహన లేకుండా పోతోంది. దీంతో దీనికి చెక్‌ పెట్టాలని బీమా నియత్రణ, అభివృద్ధి మండలి  (ఐఆర్‌డీఏఐ) యోచిస్తోంది.


వాహన కొనుగోలుదారులు ఇక వాహన ధర, మోటార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం విడివిడిగా చెల్లించే ఏర్పాట్లు చేయాలని ఐఆర్‌డీఏఐ నియమించిన వర్కింగ్‌ కమిటీ సూచించింది. కొనుగోలుదారుడు ఈ ప్రీమియాన్ని నేరుగా బీమా కంపెనీకి చెల్లించే ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సంబంధించి కొన్ని మార్గర్శకాలు సిఫారసు చేసింది. వాహన తయారీ కంపెనీలకూ ఇవే నిబంధనలు వర్తింపచేయాలని కోరింది. 

Updated Date - 2021-01-25T07:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising