ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైక్రోసాఫ్ట్‌ చేతికి న్యూఆన్స్‌

ABN, First Publish Date - 2021-04-13T07:13:18+05:30

టెక్‌ ప్రపంచంలో మరో భారీ ఒప్పందం చోటు చేసుకుంది. స్పీచ్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ న్యూఆన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఇంక్‌ను టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చేజిక్కించుకుంది. న్యూఆన్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ 1,970 కోట్ల డాలర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీల్‌ విలువ రూ.1.4 లక్షల కోట్లు

టెక్‌ ప్రపంచంలో మరో భారీ డీల్‌


న్యూయార్క్‌: టెక్‌ ప్రపంచంలో మరో భారీ ఒప్పందం చోటు చేసుకుంది. స్పీచ్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ న్యూఆన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఇంక్‌ను టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చేజిక్కించుకుంది. న్యూఆన్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ 1,970 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.4 లక్షల కోట్లు) చెల్లించనుంది. పూర్తి నగదు చెల్లింపు పద్దతిలో ఈ కంపెనీని కొనుగోలు చేసింది. హెల్త్‌కేర్‌ కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద ఒప్పందంగా భావిస్తున్నారు. 

 

23 శాతం ప్రీమియం: డీల్‌లో భాగంగా మైక్రోసాఫ్ట్‌ ఒక్కో న్యూఆన్స్‌ షేరు కోసం 56 డాలర్లు చెల్లించింది. గత శుక్రవారం ముగిసిన న్యూఆన్స్‌ షేరు ధరతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. దీంతో సోమవారం న్యూఆన్స్‌ షేరు ఒక్కసారిగా 23 శాతం దూసుకుపోయింది. సంవత్సరాంతం కల్లా డీల్‌ పూర్తవుతుందని అంచనా. 


న్యూఆన్స్‌ ప్రత్యేకత: వాషింగ్టన్‌ కేంద్రంగా ఉన్న న్యూఆన్స్‌.. కృత్రిమ మేధ ఆధారంగా స్పీచ్‌  రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు అభివృద్ధి చేస్తుంది. ఆరోగ్య రక్షణ, ఆటోమొబైల్‌తో సహా అనేక రంగాల్లో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన ‘సిరి’ స్పీచ్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ హెల్త్‌కేర్‌ రంగంలో ఇప్పటికే విస్తృతంగా వాడుకలో ఉంది. భారత్‌లో న్యూఆన్స్‌కు బెంగళూరు, పుణె నగరాల్లో కార్యాలయాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో 8,500 మంది ఉద్యోగులున్నారు. 

Updated Date - 2021-04-13T07:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising