ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యతరగతికి... భారీ షాక్ ?

ABN, First Publish Date - 2021-10-19T22:48:46+05:30

రానున్న రోజుల్లో మధ్యతరగతి ప్రజలకు కేంద్రం ఝలక్ ఇవ్వనుందా ? ఆర్‌బీఐ తాజా బులెటిన్ నేపధ్యంలో... ఇదే విషయం తేటతెల్లమవుతోంది. భవిష్యత్తులో మోదీ సర్కార్ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించేఅవకాశముందని చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రానున్న రోజుల్లో మధ్యతరగతి ప్రజలకు కేంద్రం ఝలక్ ఇవ్వనుందా ? ఆర్‌బీఐ తాజా బులెటిన్ నేపధ్యంలో... ఇదే విషయం తేటతెల్లమవుతోంది. భవిష్యత్తులో మోదీ సర్కార్ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించేఅవకాశముందని చెబుతున్నారు. కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజా బులెటిన్‌ గమనిస్తే.. ఇదే విషయం అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై 47 నుంచి 178 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీని చెల్లిస్తోందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) వడ్డీ రేటు 6.63 శాతంగా ఉండాల్సిందని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 7.1 శాతం వడ్డీని అందిస్తోందని పేర్కొంది. ఈల్డ్ ప్రాతిపదికన ప్రతి మూడు నెలలకు ఒకసారి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం సమీక్షించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్ విషయానికి వస్తే... స్ప్రెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర అనుమతి ఉంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్‌పై ఈల్డ్ సగటు 6.38 శాతంగా కొనసాగుతోంది. అంటే పీపీఎఫ్‌పై 6.63 శాతం వడ్డీ రేటు ఉండాల్సింది. కాగా...  7.1 శాతం లభిస్తోంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అన్నింటిపై కూడా ఇలాగే అధిక వడ్డీ లభిస్తోందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ఏడాది కాల పరిమితిలోని టర్మ్ డిపాజిట్లపైన 178 బేసిస్ పాయింట్ల అధిక వడ్డీ వస్తోంది. సాధారణంగా అయితే వీటిపై 3.72 శాతం వడ్డీ రావాల్సి ఉంది. అయితే 5.5 శాతం వడ్డీ లభిస్తోంది. 

Updated Date - 2021-10-19T22:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising