ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుతి కార్లు మరింత ప్రియం

ABN, First Publish Date - 2021-06-22T05:40:39+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై) నుంచి అన్ని మోడల్‌ కార్ల ధరలను పెంచుతున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూలై నుంచి అన్ని మోడళ్ల ధర పెంపు 


న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై) నుంచి అన్ని మోడల్‌ కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతి సుజుకీ ఇండియా ప్రకటించింది. స్టీల్‌ సహా కార్ల ఉత్పత్తికి అత్యవసరమైన పలు కమోడిటీల ధరలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది. దాంతో కొంత భారాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయక తప్పట్లేదని అంటోంది. అయితే, ఏ మోడల్‌పై ఎంత పెంచేదీ ఇంకా వెల్లడించలేదు. ఈ విషయంపై అంతర్గత కసరత్తు జరుగుతోందని మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో కంపెనీ కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. ముడిసరుకుల వ్యయ భారం కారణంగా ఏప్రిల్‌లోనూ రేట్లు పెంచింది.




నిస్సాన్‌ మాగ్నైట్‌ ఎగుమతులు ప్రారంభం: నిస్సాన్‌ ఇండియా తన సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మాగ్నైట్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తోం ది. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, నేపాల్‌కు మాగ్నైట్‌ ఎగుమతులను ఈ మధ్యనే ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. విదేశీ మార్కెట్‌ కోసం గత నెల వరకు 1,200 కార్లను ఉత్పత్తి చేసినట్లు నిస్సాన్‌ వెల్లడించింది. 


Updated Date - 2021-06-22T05:40:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising