ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మారుతి @ 50 లక్షలు

ABN, First Publish Date - 2021-07-22T06:04:50+05:30

మారుతి సుజుకి గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల విక్రయాల మైలురాయిని దాటింది. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1700 ఔట్‌లెట్లు కార్ల అమ్మకాల్లో 40 శాతం వాటా అందిస్తున్నాయని కంపెనీ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామీణ విక్రయాల్లో మైలురాయి

న్యూఢిల్లీ: మారుతి సుజుకి గ్రామీణ మార్కెట్లలో 50 లక్షల విక్రయాల మైలురాయిని దాటింది. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1700 ఔట్‌లెట్లు కార్ల అమ్మకాల్లో 40 శాతం వాటా అందిస్తున్నాయని కంపెనీ తెలిపింది. గ్రామీణ కస్టమర్లు, స్థానిక డీలర్ల మద్దతుతోనే ఈ కీలకమైన మైలురాయిని చేరగలిగామని కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ అన్నారు. గ్రామీణ మార్కెట్ల సామర్థ్యాన్ని గుర్తించిన తొలి కంపెనీ తమదేనని ఆయన చెప్పారు. నిరంతరం కస్టమర్ల అవసరాలను అధ్యయనం చేస్తూ వారికి అనువైన ఉత్పత్తులు, సేవలు అందించడమే తమ విజయ రహస్యమని చెప్పారు. ప్రతీ ఇంటిలోనూ మారుతి ఉండాలన్నదే తమ నెట్‌వర్క్‌ విస్తరణ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఇటీవలే తాము గ్రామీణ మార్కెట్లకు కూడా నెక్సా ఔట్‌లెట్లను విస్తరించామని ఆయన చెప్పారు. గ్రామీణ కస్టమర్ల ఆకాంక్షలు కూడా పట్టణ కస్టమర్లతో సమానంగానే ఉన్నా తమ సమస్యల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాలని, తమకు మరింత భద్రత కల్పించాలని కోరతారని ఆయన అన్నారు. 

Updated Date - 2021-07-22T06:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising