ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మార్కెట్’ తగ్గిన ‘మారుతి...’...

ABN, First Publish Date - 2021-12-06T01:53:36+05:30

భారత రోడ్లపై సగర్వంగా తిరిగుతోన్న మారుతి సుజుకి కార్లకు సంబంధించిన మార్కెట్ షేరు, గౌరవం... రెండూ తగ్గాయి. వేగంగా మారుతున్న టెక్నాలజీని ఒడిసిపట్టలేకపోవడమే ఇందుకు కారణమని వినవస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత రోడ్లపై సగర్వంగా తిరిగుతోన్న మారుతి సుజుకి కార్లకు సంబంధించిన మార్కెట్  షేరు, గౌరవం... రెండూ తగ్గాయి. వేగంగా మారుతున్న టెక్నాలజీని ఒడిసిపట్టలేకపోవడమే ఇందుకు కారణమని వినవస్తోంది. మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయకమైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) సెగ్మెంట్‌లో మార్కెట్ షేర్‌ను ఈ కంపెనీ స్థిరంగా కోల్పోతూ వస్తోంది. ఇదే క్రమంలో... టాప్‌ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ... మారుతి రేటింగ్‌ను 'అండర్ పెర్ఫార్మ్' నుంచి 'సెల్‌'కు తగ్గించింది. టార్గెట్ ప్రైస్‌ను రూ. 6,550 నుంచి రూ. 6,420 కు పరిమితం చేసింది. ప్యాసింజర్ వెహికల్‌ ఇండస్ట్రీలో ఎస్‌యూవీ సెగ్మెంట్ షేర్‌... 2020 ఆర్ధిక సంవత్సరంలోని 32 % నుంచి ఈ అక్టోబరు  వరకు 39 శాతానికి పెరిగినప్పటికీ... ఇదే సమయంలో, ఈ సెగ్మెంట్‌లో మారుతి మార్కెట్ వాటా 560 బేసిస్ పాయింట్లు తగ్గడం గమనార్హం. కాగా... 2022 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి... మరో 40 బీపీఎస్ తగ్గి, 600 బీపీఎస్‌కు చేరవచ్చని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేస్తోంది.


నవంబరులో కంపెనీ మొత్తం అమ్మకాలు... వార్షిక ప్రాతిపదికన 9.2 % తగ్గి, 1.4 లక్షల యూనిట్లకు పరిమితం కావడం గమనార్హం. బలహీనమైన లాంచ్ పైప్‌లైన్ కారణంగా... 2023, 2024 ఆర్ధిక సంవత్సరాల ఆదాయం... అంచనాల కంటే 17-20 % తక్కువగా ఉంటుందని సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. అయితే... ముడివస్తువుల ధరల్లో 10 % తగ్గుదల, ఉత్పత్తి మిశ్రమంలో మెరుగుదలను ఊహిస్తూ... ఒక్కో వాహనం ఎబిటా... 2022 ఆర్ధిక సంవత్సరంలో రూ. 32,511 గా ఉంటుందని, 2024 ఆర్ధిక సంవత్సరం నాటికి... అది రూ. 55,656 కు పెరుగుతుందని బ్రోకరేజ్ అంచనా వేసింది.


మారుతి 2022 లో రెండు కొత్త మినీ ఎస్‌యూవీలను విడుదల చేయబోతోందని, వాటిలో ఒకటి ‘ఫ్యూచరో కాగా, మరొకటి... జిమ్నీ అని బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. కాగా... శక్తివంతమైన ఎస్‌యూవీల కోసం కొనుగోలుదారులు చూస్తున్నందున, మినీ ఎస్‌యూవీలు ఎక్కువమందిని ఆకర్షించే అవకాశముందని సీఎల్‌ఎస్‌ఏ భావిస్తోంది. అయితే... ఈ నేపధ్యంలో కూడా... ఫ్యూచరో, జిమ్నీ సఫలమవుతాయని మాత్రం బ్రోకరేజ్‌ భావిస్తుండకపోవడం గమనార్హం. గత రెండేళ్లలో సెడాన్ సెగ్మెంట్‌లో మారుతి ఒక్క కొత్త ఉత్పత్తిని కూడా తీసుకురాలేదు. దీంతో ఈ సెగ్మెంట్‌లోనూ మార్కెట్ షేర్‌ కోల్పోయినట్లైంది. ఈ సెగ్మెంట్‌లో కొన్ని కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చినప్పటికీ... 2022-24 కాలంలో మారుతి మార్కెట్ వాటా 48 శాతంతో స్థిరంగా ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. 

Updated Date - 2021-12-06T01:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising