ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2.2 లక్షల కోట్లు డౌన్...

ABN, First Publish Date - 2021-02-28T23:05:06+05:30

టాప్ పది కంపెనీల్లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పతనమైంది. బడ్జెట్ అనంతరం భారీగా లాభపడిన మార్కెట్లు... అంతకుముందువారం నష్టపోయిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : టాప్ పది కంపెనీల్లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా పతనమైంది. బడ్జెట్ అనంతరం భారీగా లాభపడిన మార్కెట్లు... అంతకుముందువారం నష్టపోయిన విషయం తెలిసిందే. కాగా... గతవారం ప్రారంభంలో కాస్త లాభాలు నమోదు చేసినప్పటికీ, చివరికు భారీ నష్టాల్లో ముగిసాయి. దీంతో టాప్ 10 లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2,19,920.71 లక్షల కోట్లు తగ్గిపోయింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే గతవారం లాభపడిన టాప్ టెన్ కంపెనీల్లో ఉంది.


మార్కెట్ క్యాప్ ఎంతంటే ?...

గతవారం సెన్సెక్స్ ఏకంగా మూడు శాతం నష్టపోయింది. నిఫ్టీ కూడా దాదాపు అంతే కోల్పోయింది. ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 81,506.34 కోట్లు క్షీణించి రూ. 10,71,263.77 కోట్లకు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 2,202.12 కోట్లు పడిపోయి రూ. 8,45,552.53 కోట్లకు క్షీణించింది.


ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 18,098.57 కోట్లు పడిపోయి రూ. 4,13,078.87 కోట్లకు తగ్గింది. హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ. 11,536.32 కోట్లు క్షీణించి రూ. 5,00,937.14 కోట్లుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ. 35,389.88 కోట్లు తగ్గి రూ. 4,57,518.73 కోట్లకు చేరింది.


రిలయన్స్ జంప్...

ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 16,613.57 కోట్లు క్షీణించి రూ. 5,33,487.07 కోట్లకు చేరుకుంది. ఇక... బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15,712.46 కోట్లు తగ్గి రూ. 3,15,653.33 కోట్లుగా నమోదైంది. కొటక్ మహీంద్రా బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 30,695.43 కోట్లు తగ్గి రూ. 3,53,081.63 కోట్లకు చేరుకుంది.


ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్ రూ. 8,166.02 కోట్లు క్షీణించి రూ. 3,48,238.34 కోట్లుగా నమోదైంది. కాగా... రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ మాత్రం భారీగా ఎగియడం గమనార్హం. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ. 2,092.01 ఎగసి రూ. 13,21,044.35 కోట్లకు చేరుకుంది.


గతవారం సెన్సెక్స్ 1,786 పాయింట్లు లేదా 3.46 శాతం పతనమైంది. అంతర్జాతీయంగా మార్కెట్లు కుప్పకూలడంతో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. గత పది నెలల కాలంలో శుక్రవారం (ఫిబ్రవరి 26) సూచీలు మొదటిసారి దారుణంగా పతనమయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 568 పాయింట్లు పడిపోయింది


టాప్ 10 కంపెనీలు... రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్. 

Updated Date - 2021-02-28T23:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising