ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాన మద్దతు 14000

ABN, First Publish Date - 2021-01-18T05:31:20+05:30

నిఫ్టీ గత వారం మానసిక అవధి 14500 దాటి కన్సాలిడేట్‌ అయిన అనంతరం శుక్రవారం బలమైన రియాక్షన్‌కు గురై అంతకన్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిఫ్టీ గత వారం మానసిక అవధి 14500 దాటి కన్సాలిడేట్‌ అయిన అనంతరం శుక్రవారం బలమైన రియాక్షన్‌కు గురై అంతకన్నా దిగువన ముగిసింది. వీక్లీ చార్టుల ప్రకారం సైతం వారం కనిష్ఠ స్థాయిల్లో ముగిసింది. ఈ రియాక్షన్‌తో అప్‌ట్రెండ్‌కు మైనర్‌ విరామం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ప్రధాన ట్రెండ్‌ ఎగువకే ఉన్నా ప్రస్తుత స్థాయిలో మరింత కరెక్షన్‌ ట్రెండ్‌కు ఆస్కారం ఉంది. ఓవర్‌బాట్‌ స్థితి సద్దుబాటవుతోంది. 


బుల్లిష్‌ స్థాయిలు: అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే మాత్రం 14500 వద్ద బలంగా క్లోజ్‌ కావాలి. అప్పుడే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో పురోగమించగలుగుతుంది. తదుపరి టార్గెట్‌, ప్రధాన నిరోధం 14650. 


బేరిష్‌ స్థాయిలు: మద్దతు స్థాయి 14200. ప్రధాన మద్దతు స్థాయి 14000. అంతకన్నా దిగజారితే బలహీనపడుతుంది. ఇక్కడ కన్సాలిడేట్‌ కావచ్చు. 


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ గరిష్ఠ, కనిష్ఠ మధ్యస్థాయిలో ముగిసింది. ఇది అనిశ్చిత స్థితి సంకేతం. వీక్లీ ప్రాతిపదికన 160 పాయింట్లు లాభపడి 32000 కన్నా స్వల్పంగా పైన క్లోజయింది. మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించాలంటే ప్రధాన నిరోధం 32550 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 33000. ప్రధాన మద్దతు స్థాయి 31800 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.


పాటర్న్‌: నిఫ్టీ 14650 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి నిరోధం ఎదుర్కొంటోంది. అలాగే 14000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద మద్దతు ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌కు సంకేతం.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉంది.


సోమవారం 

స్థాయిలు

నిరోధం : 14440, 14520 

మద్దతు : 14360, 14300

Updated Date - 2021-01-18T05:31:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising