ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడు ఉద్యోగం పోయింది... ఇప్పుడు పాతిక లక్ఖల సంపాదన...

ABN, First Publish Date - 2021-01-11T00:58:15+05:30

కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఓ సెక్యూరిటీ గార్డు... ఇప్పుడు సంవత్సరానికి పాతిక లక్షలు సంపాదిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే : కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఓ సెక్యూరిటీ గార్డు... ఇప్పుడు సంవత్సరానికి పాతిక లక్షలు సంపాదిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి. 


ధైర్యం, కష్టం, అదృష్టం కలిపితే విజయం ఖాయమని. పూణే(మహారాష్ట్ర) కు చెందిన రేవన్ షిండే విషయంలో రుజువైంది. ఒక చిన్న వ్యాపారం ద్వారా... షిండే తన ఆదాయాన్ని సంవత్సరంలో లక్షల స్థాయికి పెంచగలిగాడు. ఇందుకు ఆవలంబన ‘టీ’ వ్యాపారం. అంతకు ముందు 2019 చివరి నెలలో, అతను తన సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.


టీ స్టార్టప్ ప్రారంభం...


2019 డిసెంబరులో ఉద్యోగం మానేసిన తరువాత షిండే జూన్ 2020 లో తన టీ స్టార్టప్‌ను ప్రారంభించారు. వాస్తవానికి కరోనా భయంతో అప్పటి వరకూ ఉన్న టీ స్టాల్ యజమానులు  వ్యాపారం మానేసి ఊళ్లకు వెళ్లిపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని షిండే  టీ, కాఫీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు రోజువారీ అమ్మకాలు 700 టీ కప్పుల స్థాయికి చేరుకుంది.


రూ. 12 వేల జీతం నుంచి  రూ. 25 లక్షల వరకూ ప్రయాణం...

ఆరు సంవత్సరాల క్రితం షిండేకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వచ్చింది. జీతం రూ .12 వేలు మాత్రమే. కానీ 2019 డిసెంబరులో ఆ లాజిస్టిక్స్ ఆగిపోయింది, దానితో షిండే నిరుద్యోగి అయ్యాడు. అనంతరం స్నాక్ సెంటర్‌లో పనిచేశారు. షిండే చివరకు చిన్న స్థలాన్ని తీసుకొని తానే ఓ చిరుతిండి, టీ స్టాల్ తెరిచాడు.


ఉచిత టీ...

లాక్‌డౌన్ లో షిండే సమస్యలనెదుర్కొన్నాడు. జూన్ నాటికి లాక్‌డౌన్ సడలింపులు ప్రారంభమయ్యాయి.  కార్యాలయాల్లో మెల్లగా పని ప్రారంభమైంది. ఈ క్రమంలో... షిండే... థర్మోస్, కాగితాలను తీసుకొని కార్యాలయాలకు వెళుతూ టీ, కాఫీ ఉచితంగా ఇవ్వడం ప్రారంభించాడు. రెండు నెలలు ఇలా ఉచితంగానే అందించాడు. ఆ తర్వాత... షిండేకు ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. అల్లం టీ, కాఫీ, వేడి పాలను షిండే విక్రయిస్తున్నాడు. అతని చిన్న కప్పు టీ ధర రూ . 6, పెద్ద కప్పు ధర రూ . 10. వారు రోజూ 700 కప్పుల వరకు పింప్రి-చిన్చ్వాడ్‌లో విక్రయిస్తారు. ఇది అతనికి ప్రతి నెలా రూ.  2  లక్షలు అందిస్తోంది. ఈ క్రమంలో... షిండే వార్షికాదాయం రూ . 25 లక్షలకు చేరుకుంది. మొత్తంమీద కరోనా నేపధ్యంలో షిండే నమ్ముకున్న శ్రమ... ఇప్పుడు ఇతరులకు ఆదర్శంగా మారింది. 


Updated Date - 2021-01-11T00:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising