ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరవ్‌ మోదీ అప్పగింతకు లైన్‌ క్లియర్‌

ABN, First Publish Date - 2021-04-17T06:35:17+05:30

పరారీలో ఉన్న భారత వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌ రప్పించే ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలపై బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌ సంతకం చేసినట్టు భారత దౌత్య వర్గాలు చెప్పాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: పరారీలో ఉన్న భారత వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌ రప్పించే ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలపై బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌ సంతకం చేసినట్టు భారత దౌత్య వర్గాలు చెప్పాయి. అయితే మోదీ ఈ ఆదేశాల్ని 14 రోజుల్లోపు లండన్‌ హైకోర్టులో సవాల్‌ చేసేందుకు అవకాశం ఉంది. అలా చేయకపోతే నీరవ్‌ను బ్రిటన్‌, భారత్‌కు అప్పగించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ని 200 కోట్ల డాలర్ల (రూ.14,000 కోట్లు) మేర మోసం చేసిన కేసులో నీరవ్‌ మోదీ కీలక నిందితుడు. ఆ కుంభకోణం వెలుగు చూడక ముందే విదేశాలకు పరారైన మోదీ ప్రస్తుతం లండన్‌లోని ఒక  జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. స్థానిక కోర్టు కూడా మోదీని భారత్‌కు అప్పగించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. 

Updated Date - 2021-04-17T06:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising