ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రూ. 1.84 లక్షల కోట్లు... ఎల్‌ఐసీ రికార్డ్...

ABN, First Publish Date - 2021-04-21T21:51:25+05:30

కరోనా నేపధ్యంలో కూడా... ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు సృష్టించింది. రూ. 1.84 లక్షల కోట్ల మేరకు కొత్త బిజినెస్‌ ప్రీమియంను వసూలు చేసింది. వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : కరోనా నేపధ్యంలో కూడా...  ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీ రికార్డు సృష్టించింది. రూ. 1.84 లక్షల కోట్ల మేరకు కొత్త బిజినెస్‌ ప్రీమియంను వసూలు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మార్చితో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ కొత్త బిజినెస్‌ ప్రీమియం ఆదాయం రికార్డు స్థాయిలో (రూ. 1.84 లక్షల కోట్లు)గా నమోదైంది.


ఇందులో వ్యక్తిగత పాలసీదారులు చెల్లించిన మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం రూ. 56,406 కోట్లు. అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుని చేస్తే... ఇది 10.11 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఎల్‌ఐసీ 2.10 కోట్ల పాలసీలను విక్రయించింది. ఇందులో 46.72 లక్షల పాలసీలు ఒక్క మార్చి నెలలోనే విక్రయించింది. ఇక మార్కెట్‌ వాటాపరంగా చూస్తే ఎల్‌ఐసీ ఈ ఏడాది మార్చి నెలలో 81.04 శౄతం, 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం 74.58 శాతం మార్కెట్‌ వాటాను సాధించింది.


ప్రైవేటు బీమా సంస్థల నుంచి పోటీ అధికంగా ఉన్నప్పటికీ... మార్కెట్‌లో ఎల్ఐసీ తన దూకుడును కొనసాగిస్తుండటం గమనార్హం. కాగా... కరోనా నేపధ్యంలో ఎల్‌ఐసీ పాలసీల సంఖ్య పెరిగిపోయింది. బీమా పాలసీలంటే గతంలో పెద్దగా పట్టించుకోని వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాలసీలు చేసుకునే వారి సంఖ్య పెరిగినట్లు సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. 



Updated Date - 2021-04-21T21:51:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising