ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

connectivity : కొత్త మార్గాల్లో 8 విమాన సర్వీసులు

ABN, First Publish Date - 2021-07-17T14:29:44+05:30

కొత్త కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 8 కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి

న్యూఢిల్లీ :కొత్త కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 8 కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ప్రాంతీయ వైమానిక అనుసంధానం పెంచడానికి 8 విమానసర్వీసులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. గ్వాలియర్-ముంబై-గ్వాలియర్, గ్వాలియర్-పూణే-గ్వాలియర్, జబల్పూర్-సూరత్-జబల్పూర్, అహ్మదాబాద్-గ్వాలియర్-అహ్మదాబాద్ మార్గాల్లో 8 విమాన సర్వీసులను కొత్తగా ప్రారంభించారు.ప్రాంతీయ వాయు కనెక్టివిటీని పెంచడానికి తాము చర్యలు తీసుకున్నామని మంత్రి సింధియా చెప్పారు.


ఢిల్లీ -జబల్పూర్ మార్గంలో అదనపు విమాన సర్వీసులను జులై 18 నుంచి ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఖజురహో-ఢిల్లీ-ఖజురహోకు కొత్తగా విమాన సర్వీసును అక్టోబరు నుంచి నడుపుతామని మంత్రి జ్యోతిరాదిత్య ప్రకటించారు. మూడు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీ పెంచడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని మంత్రి చెప్పారు. ఉడాన్ పథకం కింద కోల్ కతా, ఇంపాల్, దిబ్రూఘడ్ నగరాలకు విమాన సర్వీసులను నడుపుతున్నారు. 


Updated Date - 2021-07-17T14:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising