ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ పేరుతో వీడియో విడుదల చేసిన జియో.. ఫీచర్లు ఇవే!

ABN, First Publish Date - 2021-10-26T00:46:16+05:30

దీపావళి పండుగకు ముందు జియో ఫోన్ నెక్స్ట్ తదుపరి సేల్ ప్రారంభం కానుండగా అంతకంటే ముందే కొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ముందు జియో ఫోన్ నెక్స్ట్ తదుపరి సేల్ ప్రారంభం కానుండగా అంతకంటే ముందే కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వీడియో టీజర్ ద్వారా విడుదల చేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌తో పనిచేస్తుంది. గూగుల్ భాగస్వామ్యంలో తయారైన జియోఫోన్ నెక్స్ట్‌లో క్వాల్‌కామ్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అయితే, మోడల్ వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ,క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215ను ఉపయోగించి ఉండొచ్చని తెలుస్తోంది.


వాయిస్ అసిస్టెన్స్, రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్, 13 ఎంపీ రియర్ కెమెరా, ఫ్లాష్ లైట్‌తో కూడిన సెల్ఫీ కెమెరా, ముందే లోడ్ చేసిన గూగుల్, జియో యాప్స్ ఉన్నాయి. ఇందులోని ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా ఏ భాషలో ఉన్న టెక్స్ట్‌ను అయినా నచ్చిన భాషలోకి మార్చుకోవచ్చు. జియో ఫోన్ నెక్స్ట్ ధర రూ. 3,499 ఉండే అవకాశం ఉంది.


‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ పేరుతో విడుదల చేసిన ఈ టీజర్‌లో ఫోన్ ఆవిష్కరణ వెనక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. జియో ఫోన్ నెక్ట్స్ తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి యూనిట్‌లో అసెంబుల్ చేశారు. ఇందులో ఉపయోగించిన ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌ను ప్రత్యేకంగా భారతీయులను ఉద్దేశించి డిజైన్ చేశారు. ఇది బ్యాటరీ దీర్ఘకాలం మన్నేలా చేస్తుంది. అలాగే, ఎప్పటికప్పుడు ఇది సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకుంటుంది.



Updated Date - 2021-10-26T00:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising