ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JioPhone Next ధర ఎంతో తెలిసిపోయింది.. అనుకున్నదాని కంటే ఎక్కువే!

ABN, First Publish Date - 2021-10-29T23:43:59+05:30

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్స్ట్ దీపావళి రోజున (నవంబరు 4)న మార్కెట్లోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్స్ట్ దీపావళి రోజున (నవంబరు 4)న మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఫోన్ ధరపై ఇప్పటి వరకు సందిగ్ధత విడిపోయింది. జియోఫోన్ నెక్స్ట్‌ పూర్తి ధర రూ. 6,499. అయితే, రూ. 1,999 చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. నిజానికి ఈ ఫోన్ ధర రూ. 3 వేల లోపు ఉంటుందని అందరూ భావించారు. అయితే, ఇప్పుడు ఏకంగా దానికి దాదాపు రెండింతలుగా పేర్కొనడం గమనార్హం.


తొలుత రూ. 1999 చెల్లించిన ఫోన్‌ను తీసుకున్న తర్వాత వాయిదాల పద్ధతిలో మిగతా సొమ్మును 18/14 నెలల్లో చెల్లించవచ్చు. రిలయన్స్ డిజిటల్ రిటైల్ స్టోర్లలో దేశవ్యాప్తంగా ఫోన్లు అందుబాటులో ఉంటాయని రిలయన్స్ ప్రకటించింది.    


జియోఫోన్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌తో పనిచేస్తుంది. గూగుల్ భాగస్వామ్యంలో తయారైన ఇందులో క్వాల్‌కామ్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 215ను ఉపయోగించి ఉండొచ్చని తెలుస్తోంది. వాయిస్ అసిస్టెన్స్, రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్, 13 ఎంపీ రియర్ కెమెరా, ఫ్లాష్ లైట్‌తో కూడిన సెల్ఫీ కెమెరా, ముందే లోడ్ చేసిన గూగుల్, జియో యాప్స్ ఉన్నాయి.


ఇందులోని ట్రాన్స్‌లేట్ ఫీచర్ ద్వారా ఏ భాషలో ఉన్న టెక్స్ట్‌ను అయినా నచ్చిన భాషలోకి మార్చుకోవచ్చు. ఇందులో ఉపయోగించిన ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్‌ను ప్రత్యేకంగా భారతీయులను ఉద్దేశించి డిజైన్ చేశారు. ఇది బ్యాటరీ దీర్ఘకాలం మన్నేలా చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకునేలా రూపొందించారు. 

Updated Date - 2021-10-29T23:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising