ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jio: రెండు రోజులపాటు ఉచితంగా అపరిమిత డేటా ఆఫర్

ABN, First Publish Date - 2021-10-07T14:30:51+05:30

రెండు రాష్ట్రాల వినియోగదారులకు జియో శుభవార్త వెల్లడించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల వినియోగదారులకు జియో శుభవార్త వెల్లడించింది. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ సమస్యల గురించి చందాదారులు ఫిర్యాదు చేయడంతో రిలయన్స్ జియో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ప్రజల కోసం కాంప్లిమెంటరీ అపరిమిత ఆఫరును అందిస్తోంది.చాలా మంది వినియోగదారులు బుధవారం (అక్టోబర్ 6) జియో నెట్ వర్క్ డౌన్ అయ్యిందని ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొంత మంది కస్టమర్‌లు జియో సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. తమ బృందాలు ఈ నెట్‌వర్క్ సమస్యను కొన్ని గంటల వ్యవధిలో పరిష్కరించగలిగినప్పటికీ,అంతరాయంపై జియో క్షమాపణలు చెప్పింది. 


అంతరాయానికి చింతిస్తూ గుడ్ విల్ కాంప్లిమెంటరీగా రెండు రోజుల పాటు ఉచితంగా అపరిమిత డేటా ఆఫరును ఇస్తున్నామని జియో తెలిపింది. కాంప్లిమెంటరీ అపరిమిత ఆఫర్ బుధవారం రాత్రి అంతరాయంతో బాధపడుతున్న వారికి వర్తిస్తుందని జియో వివరించింది.భారతదేశవ్యాప్తంగా జియో సెల్యులార్ నెట్‌వర్క్ అంతరాయాల గురించి 4,000 ఫిర్యాదులు వచ్చాయి.వీరిలో 41 శాతం మంది సిగ్నల్ లేదని, 37 శాతం మంది తమ ఈమెయిల్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారని, 23 శాతం మంది మొత్తం బ్లాక్‌అవుట్ ఎదుర్కొన్నామని ఫిర్యాదు చేశారు.దీంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని ప్రజల కోసం జియో 2 రోజుల కాంప్లిమెంటరీ ప్లాన్‌ను అందిస్తోంది.


Updated Date - 2021-10-07T14:30:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising