ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జెఫ్ బెజోస్... నాలుగు రోజుల్లో ఐదు బిలియన్ డాలర్ల స్టాక్స్ విక్రయిం...

ABN, First Publish Date - 2021-05-09T19:45:37+05:30

బెజోస్ తన అమెజాన్ డాట్ కామ్ ఇంక్‌కు చెందిన 2.4 బిలియన్ స్టాక్స్‌ను విక్రయించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సియాటిల్ : బెజోస్ తన అమెజాన్ డాట్ కామ్ ఇంక్‌కు చెందిన 2.4 బిలియన్ స్టాక్స్‌ను విక్రయించాడు. ఈ క్రమంలో... గతవారం వరకు అతను  5 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను విక్రయించినట్లైంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌లో ఫైలింగ్ చేసిన వివరాల ప్రకారం... ప్రీ-అరేంజ్డ్ ట్రేడింగ్ ప్లాన్ కింద బెజోస్ 739,032 షేర్లను విక్రయించాడు. అంతేకాదు... మరో రెండు మిలియన్ల షేర్లను విక్రయిస్తానని కూడా అతను ఫైలింగ్‌పేర్కొన్నాడు. ప్రపంచ కుబేరుడైన జెఫ్ బెజోస్‌కు అమెజాన్‌లో 10 శాతానికి పైగా వాటా ఉంది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అతని సంపద 192.1 బిలియన్ డాలర్లు. వాటాల విక్రయం 1997 లో  అమెజాన్ పబ్లిక్‌లోకి వచ్చిన పదిహేనేళ్ల తర్వాత కాలంలో బెజోస్ ఆన్‌లైన్ రిటైలర్‌లో ఐదో వంతును దాదాపు రెండు  బిలియన్ డాలర్లకు విక్రయించారు. కాగా... ఇటీవలి కాలంలో బెజోస్ వాటా మరింతగా పెరగడం గమనార్హం. గతేడాది అతను పది బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించిన విషయం తెలిసిందే.  అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ తన రాకెట్ కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ కోసం గత కొద్ది కాలంగా అమెజాన్‌లోని తన వాటాలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-05-09T19:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising