ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలాన్‌ మస్క్‌పై కనక వర్షం!

ABN, First Publish Date - 2021-10-27T08:14:38+05:30

ఒక్కరోజులోనే రూ.2.72 లక్షల కోట్లు పెరిగిన టెస్లా అధిపతి సంపద ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కరోజులోనే రూ.2.72 లక్షల కోట్లు పెరిగిన టెస్లా అధిపతి సంపద 

అమెరికా విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌పై కనక వర్షం కురిసింది. ఒక్క రోజులోనే ఆయన సంపద 3,620 కోట్ల డాలర్లు (దాదాపు రూ.2,71,500 కోట్లు) పెరిగి 28,900 కోట్ల డాలర్లకు (సుమారు రూ.21.68 లక్షల కోట్లు) చేరుకుంది. టెస్లా నుంచి లక్ష కార్లు కొనుగోలు చేయబోతున్నట్లు కార్లు అద్దెకిచ్చే కంపెనీ హెర్జ్‌ ప్రకటించింది. దాంతో టెస్లా షేర్లు సోమవారం నాడు 15 శాతం మేర ఎగబాకి 1,045 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని దాటింది. టెస్లాలో 23 శాతం వాటా కలిగిన మస్క్‌ వ్యక్తిగత సంపద కూడా అమాంతం ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా ఒక పారిశ్రామికవేత్త ఒక్కరోజు సంపద పెరుగుదలలో ఇప్పటివరకిదే అత్యధికం. ప్రస్తుతం మస్క్‌ ప్రపంచ నం.1 ధనవంతుడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆయన సంపద 11,900 కోట్ల డాలర్లు (70 శాతం) పెరిగింది. అంతేకాదు, ప్రపంచంలో 20,000 కోట్ల డాలర్లకు పైగా ఆస్తి కలిగిన ఏకైక వ్యక్తి మస్క్‌. ప్రపంచ నం.2 ధనవంతుడైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 19,300 కోట్ల డాలర్లుగా ఉంది. 

Updated Date - 2021-10-27T08:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising