వయో వృద్ధులకు ఊరట
ABN, First Publish Date - 2021-09-06T07:28:16+05:30
ఆదాయ పన్ను (ఐటీ) పరిధిలోకి వచ్చే వయోవృద్ధులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్ బాదరబంది నుంచి వీరికి విముక్తి కల్పించింది...
- 75 దాటితే రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను (ఐటీ) పరిధిలోకి వచ్చే వయోవృద్ధులకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్ బాదరబంది నుంచి వీరికి విముక్తి కల్పించింది. జీవిత చరమాంకంలో ఉన్న 75 లేదా అంతకు మించి వయసున్న వయోవృద్ధులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ చర్య ద్వారా ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) విడుదల చేసింది. పెన్షన్ ఖాతా, వడ్డీ ఆదాయం వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకే బ్యాంక్ బ్రాంచ్‌లో ఉన్న వయోవృద్ధులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది.
ఇతర ప్రధాన నిబంధనలు
- ఒకే బ్యాంక్ బ్రాంచ్‌లో పెన్షన్ ఖాతా, వడ్డీ ఆదాయం వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఉండాలి.
- సీనియర్ సిటిజన్లు ఫారం-12బీబీఏలో తమ పెన్షన్, వడ్డీ ఆదాయ వివరాలను తమకు ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌కు సమర్పించాలి.
- బ్యాంక్ బ్రాంచ్ సీనియర్ సిటిజన్ల ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను మినహాయించి ప్రభు త్వ ఖాతాలో జమ చేస్తుంది.
- సీనియర్ సిటిజన్ల నుంచి ఫారం-12బీబీఏలో ఈ వివరాలు స్వీకరించేందుకు ప్రతి బ్యాంక్ బ్రాంచ్‌లో ప్రత్యేక కౌంటర్లు.
- అవసరమైతే సీనియర్ సిటిజన్ల ఫారం-12బీబీఏలను బ్యాంక్ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి స్వీకరించే సౌలభ్యం.
Updated Date - 2021-09-06T07:28:16+05:30 IST