ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ చేజారిన ఇరాన్‌ గ్యాస్‌ క్షేత్రం

ABN, First Publish Date - 2021-05-18T06:11:53+05:30

ఇరాన్‌లోని ఫర్జాద్‌-బీ గ్యాస్‌ క్షేత్రం భారత్‌ చేజారింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ 2008లో ఈ క్షేత్రంలో భారీ సహజ వాయువు (గ్యాస్‌) నిక్షేపాలు కనుగొంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇరాన్‌లోని ఫర్జాద్‌-బీ గ్యాస్‌ క్షేత్రం భారత్‌ చేజారింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌ 2008లో ఈ క్షేత్రంలో భారీ సహజ వాయువు (గ్యాస్‌) నిక్షేపాలు కనుగొంది. దీంతో 1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ కంపెనీలు ప్రతిపాదించాయి. అయితే ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షల ఫలితంగా ఈ చర్చలు పెద్దగా ముందుకు సాగలేదు. దీంతో ఈ క్షేత్ర అభివృద్ధి పనులను తన  దేశానికే చెందిన పెట్రోపార్స్‌ గ్రూప్‌ అనే కంపెనీకి కట్టబెడుతున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది. సోమవారం ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. దీంతో ఫర్జాద్‌-బీ గ్యాస్‌ క్షేత్రం భారత్‌ చేజారినట్టయింది. ఇరాన్‌ తీరంలోని సముద్ర జలాల్లో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు 23 లక్షల కోట్ల ఘనపు అడుగుల గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్టు ఓఎన్‌జీసీ విదేశ్‌ అంచనా.  అమెరికా ఆంక్షలను పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టేలా  భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే ఇరాన్‌ ఇలా చేస్తోందనే వార్తలూ వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-05-18T06:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising