ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వినియోగదారుల విశ్వాసం వెలవెల

ABN, First Publish Date - 2021-04-22T06:42:52+05:30

పట్టణ ప్రాంత వినియోగదారులకు మళ్లీ కొవిడ్‌ భయం పట్టుకుంది. దీంతో ఎక్కడ తమ ఉద్యోగాలు, పొదుపు, పెట్టుబడులకు కోతపడుతోందని భయపడుతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భయపెడుతున్న కొవిడ్‌ రెండో ఉధృతి


న్యూఢిల్లీ: పట్టణ ప్రాంత వినియోగదారులకు మళ్లీ కొవిడ్‌ భయం పట్టుకుంది. దీంతో ఎక్కడ తమ ఉద్యోగాలు, పొదుపు, పెట్టుబడులకు కోతపడుతోందని భయపడుతున్నారు.  రెఫినిటివ్‌-ఇప్సోస్‌ ప్రైమరీ కన్స్యూమర్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌ (పీసీఎ్‌సఐ) సర్వేలో ఈ విష యం స్పష్టంగా వెల్లడైంది. ఉద్యోగాలు, పర్సనల్‌ ఫైనా న్స్‌, ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులపై వినియోగదారుల విశ్వాసం ఎలా ఉందనే విషయాలపై ఈ సంస్థ ప్రతి నెలా సర్వే చేస్తుంది. గత నెల 26 నుంచి ఈ నెల 9 వరకు చేసిన సర్వేలో ఈ విశ్వాసం 1.1 శాతం పడిపోయింది. ఈ నాలుగు అంశాల్లోనూ పట్టణ వినియోగదారుల విశ్వాసం 0.6 శాతం నుంచి 1.5 శాతం వరకు తగ్గింది. కొవిడ్‌ రెండో దశ ఉధృతి నేపథ్యంలో వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదం ఉందని ఎక్కువ మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉధృతి ఇప్పటికే జీవనోపాధిని, సాధారణ పరిస్థితులను మార్చేసిందని సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది చెప్పారు. మళ్లీ ఉద్యోగాలు, జీతాలకు కోత పడితే, ఇప్పటి వరకు దాచుకున్న పొదుపు లేదా పెట్టుబడుల కు చిల్లు పెట్టక తప్పదని ఎక్కువ మంది ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-22T06:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising