ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డు స్థాయికి... పెట్టుబడులు

ABN, First Publish Date - 2021-07-26T00:28:06+05:30

దేశీయ కేపిటల్ మార్కెట్‌లో పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా పెట్టుబడులు జూన్ చివరి నాటికి రూ . 92,261 కోట్లకు చేదాయి. మూడు సంవత్సరాలలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : దేశీయ కేపిటల్ మార్కెట్‌లో పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా పెట్టుబడులు జూన్ చివరి నాటికి రూ . 92,261 కోట్లకు చేదాయి. మూడు సంవత్సరాలలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కాగా... తమను తాము నేరుగా నమోదు చేసుకోకుండా భారతీయ స్టాక్ మార్కెట్‌లో భాగం కావాలనుకునే విదేశీ పెట్టుబడిదారులకు రిజిస్టర్డ్ ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పీ-నోట్’లను జారీ చేస్తారు.


‘మార్కెట్‌లో వారు పరోక్షంగా ప్రవేశిస్తారు. సెబీ డేటా ప్రకారం... భారతీయ మార్కెట్లలో పీ-నోట్ పెట్టుబడుల విలువ... ఈక్విటీ, డెట్ మరియు హైబ్రిడ్ సెక్యూరిటీలు కలిసి జూన్ చివరలో రూ. 92,261 కోట్లకు పెరిగాయి. ఇక... ‘మే’ చివరి నాటికి ఇవి రూ. 89,743 కోట్లుగా ఉన్నాయి. మొత్తం రూ. 92,261 కోట్లలో రూ. 83,792 కోట్లు ఈక్విటీలలో, రూ. 8,069 కోట్ల డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో మరో రూ. 2,392 కోట్లు పెట్టుబడి పెట్టారు.ఎఫ్‌పీఐల అదుపులో ఉన్న అసెట్ మొత్తం జూన్ నెలాఖరులో రూ. 48 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇదిలాఉండతా... జూన్‌లో భారత ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ. 17,215 కోట్ల నికర మొత్తాన్ని జొప్పించడం విశేషం. 

Updated Date - 2021-07-26T00:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising