ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఆర్‌సీటీసీ షేరు ఢమాల్‌

ABN, First Publish Date - 2021-10-20T08:02:55+05:30

ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఐఆర్‌సీటీసీ షేరు ఉత్థాన పతనాలను చవిచూసింది. ప్రారంభంలో కంపెనీ షేరు ధర రూ.6,000 మైలురాయిని దాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఐఆర్‌సీటీసీ షేరు ఉత్థాన పతనాలను చవిచూసింది. ప్రారంభంలో కంపెనీ షేరు ధర రూ.6,000 మైలురాయిని దాటింది. ఒకదశలో 7 శాతానికి పైగా పెరిగి రూ.6,393 వద్ద సరికొత్త ఆల్‌టైం గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. దాంతో కంపెనీ మార్కెట్‌ విలువ  రూ.లక్ష కోట్లకు చేరుకుంది. కానీ, రికార్డు గరిష్ఠాల వద్ద కంపెనీ ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటంతో షేరు ఽఅమాంతం పతనమైంది. ఒకదశలో 15 శాతం (రూ.1,400) మేర క్షీణించి రూ.4,995 స్థాయికి జారుకుంది. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చితే 22 శాతం తగ్గింది. చివర్లో కాస్త కోలుకున్నప్పటికీ, 8.75 శాతం నష్టంతో రూ.5,363 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ వైడ్‌ పొజిషన్స్‌ లిమిట్‌ (ఎండబ్ల్యూపీఎల్‌) 95 శాతానికి మించితే, ఐఆర్‌సీటీసీ షేర్ల ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్‌ కాంట్రాక్టులపై ఎక్స్ఛేంజీలు తాత్కాలిక నిషేధం విధిస్తాయన్న ముందుజాగ్రత్తతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను సర్దుబాటు చేసుకోవడం ఇందుకు కారణమైంది. ఎందుకంటే, ఎండబ్ల్యూపీఎల్‌ మళ్లీ 80 శాతానికి తగ్గేవరకు కంపెనీ షేర్ల ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టులపై నిషేధం కొనసాగుతుంది. ఆ సమయంలో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను తగ్గించుకోవడం తప్ప కొత్తగా పొజిషన్లను తీసుకునేందుకు అనుమతి ఉండదు. 

Updated Date - 2021-10-20T08:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising