ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా రంగంలో ‘డిజిటల్‌’ ఒరవడి

ABN, First Publish Date - 2021-12-05T08:23:05+05:30

కొవిడ్‌ అనంతరం బీమా పరిశ్రమ వేగంగా డిజిటలీకరణ వైపు అడుగుల వేస్తోంది. సాధారణంగా బీమా రంగంలో ఖాతాదారులతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏఆర్‌, వీఆర్‌ టెక్నాలజీల వినియోగం

 ఎక్సైడ్‌ లైఫ్‌ సీఓఓ అశ్విన్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ అనంతరం బీమా పరిశ్రమ వేగంగా డిజిటలీకరణ వైపు అడుగుల వేస్తోంది. సాధారణంగా బీమా రంగంలో ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉంటాయి. అయితే..మారుతున్న పరిస్థితుల్లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి బీమా కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయని ఎక్సైడ్‌ లైఫ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ బీ అశ్విన్‌ తెలిపారు. వివిధ పాలసీల మధ్య పోలికల నుంచి పాలసీల విక్రయం, క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌ వంటి అన్ని అంశాలకు జీవిత బీమా కంపెనీలు డిజిటల్‌ టూల్స్‌ను వినియోగిస్తున్నాయని చెప్పారు. జీవిత బీమా రంగంలో ఖాతాదారులకు మెరుగైన అనుభవాన్ని కలిగించడానికి బీమా కంపెనీలు అగ్‌మెంటెడ్‌, వర్చువల్‌ రియాలిటీ (ఏఆర్‌, వీఆర్‌) టెక్నాలజీలను వినియోగిస్తున్నాయి. చాట్‌బాట్లు, వర్చ్యువల్‌ అసిస్టెంట్లను ప్రవేశపెడుతున్నాయి. ఆన్‌లైన్‌ అండర్‌రైటింగ్‌ సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు అశ్విన్‌ వివరించారు. 


నకిలీ క్లెయిమ్‌లకు చెక్‌: డిజిటల్‌ టెక్నాలజీల వినియోగం వల్ల కంపెనీలకు స్ట్రక్చర్డ్‌ డేటా లభిస్తోంది.దీంతో నకిలీ క్లెయిమ్‌లు, కస్టమర్‌ మనస్తత్వం తెలుసుకోవడం వంటి అంశాలకు ప్రిడిక్టివ్‌ మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రాసె్‌సలు సులభతరం అవుతున్నాయని.. వ్యాపార సమస్యలను భిన్న కోణం నుంచి కంపెనీలు చూడగలుగుతున్నాయని అశ్విన్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-05T08:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising