ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా లేదా బ్యాంకింగ్... ఏది ప్రైవేటుపరం కానుంది ?

ABN, First Publish Date - 2021-02-24T00:09:14+05:30

బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బ్యాంకుల మధ్య పోటీతత్వాన్ని పెంచి వాటిని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మరిన్ని సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నేపధ్యంలో పలు ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకుల పేర్లు వెలుగులోకి రాగా, తాజాగా ఈ జాబితాలో ఓ బీమా కంపెనీ పేరు కూడా వినిపిస్తోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


దేశంలో ఎల్‌ఐసీ తర్వాతి స్థానాల్లో ఉన్న ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలలో  ఒకదానిని ప్రైవేటీకరించే అవకాశలున్నట్లు సమాచారం. ఈ క్రమంలో... వీటి పేర్లను కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో వినవస్తోంది. ఈ రెండు బీమా సంస్థల ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పటికే మూలధన సాయంతో మెరుగుపడిన నేపధ్యంలో... వీటిని ప్రైవేటీకరించే అవకాశముందని సమాచారం.


అంతేకాకుండా ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరచేందుకుగాను ఈ త్రైమాసికంలోనే మరో రూ. 3 వేల కోట్ల మూలధన సాయాన్నందించే అవకాశమున్నట్లు వినవస్తోంది. ఈ రెండు సంస్థల్లో ఒకదానిని ప్రైవేటీకరించే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లతో పాటు న్యూ ఇండియా ఇన్సురెన్స్సంస్థ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు వినవస్తోంది. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. 

Updated Date - 2021-02-24T00:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising