ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఏడాది వేతన వృద్ధి 9.3%

ABN, First Publish Date - 2021-10-21T07:59:09+05:30

వచ్చే ఏడాది భారత కార్పొరేట్‌ రంగ ఉద్యోగుల వేతనాలు సరాసరిగా 9.3 శాతం మేర పెరగవచ్చని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఏడాదిలో 8 శాతం.. విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ అంచనా 


ముంబై: వచ్చే ఏడాది భారత కార్పొరేట్‌ రంగ ఉద్యోగుల వేతనాలు సరాసరిగా 9.3 శాతం మేర పెరగవచ్చని అంతర్జాతీయ అడ్వైజరీ, బ్రోకింగ్‌  అండ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది సరాసరి వృద్ధి అంచనా 8 శాతం కంటే అధికమని అంటోంది. 2022 సగటు వేతన వృద్ధి అంచనా ఆసియా పసిఫిక్‌ దేశాల్లోకెల్లా అత్యధి కమని రిపోర్టులో పేర్కొంది. ఈ ఏడాది మే-జూన్‌ కాలంలో ఆసియా పసిఫిక్‌లోని 13 మార్కెట్లలో అన్ని రంగాలకు చెందిన 1,405 కంపెనీల నుంచి ఆన్‌లైన్‌లో సేకరించిన వివరాల ద్వారా ఈ నివేదికను రూపొందించినట్లు విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ తెలిపింది. భారత్‌లోని 435 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వచ్చే ఏడాది కాలంలో ఆదాయంపై 52.2 శాతం కంపెనీలు సానుకూల దృక్పథంతో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. వచ్చే 12 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు 30 శాతం కంపెనీలు వెల్లడించాయి. 

Updated Date - 2021-10-21T07:59:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising