అందుబాటులోకి... ఇన్‌కం ట్యాక్స్ ‘ఈ-ఫైలింగ్ పోర్టల్’...
ABN, First Publish Date - 2021-06-07T20:41:27+05:30
ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ ఈ-ఫైలింగ్ పోర్టల్ ఈ రోజు(జూన్ 7) అందుబాటులోకొచ్చింది.
ముంబై : ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ ఈ-ఫైలింగ్ పోర్టల్ ఈ రోజు(జూన్ 7) అందుబాటులోకొచ్చింది. ఆదాయ పన్ను శాఖ సోమవారం దీనిని ప్రారంభింది. వాస్తవానికి ఈ పోర్టల్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ... జూన్ 1 వ తేదీ నుండి అందుబాటులో లేదు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
\
రిటర్న్స్ దాఖలును మొబైల్ ఫోన్‌లోనే చేసుకునేలా... ఈ-ఫైలింగ్ పోర్టల్ ఉండనుంది. ఈ క్రమంలో... ఇప్పటి వరకు ఉన్న వెబ్‌సైట్ స్థానంలో http:///incometax.gov.in అందుబాటులోకొచ్చింది. ముందుగా పూర్తి చేసిన ఐటీ ఫారమ్స్ ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఈ-ఫైలింగ్ 2.0 పోర్టల్‌లో కొత్త మొబైల్ యాప్ ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
Updated Date - 2021-06-07T20:41:27+05:30 IST